Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆరోగ్యంBreaking NewsfoodTOP STORIESహైదరాబాద్

Watermelon : పుచ్చకాయ తీసుకుంటున్నారా.. వీటిని చెక్ చేయకపోతే రుచిలేని పండుతో డబ్బులు బొక్క..!

Watermelon : పుచ్చకాయ తీసుకుంటున్నారా.. వీటిని చెక్ చేయకపోతే రుచిలేని పండుతో డబ్బులు బొక్క..!

మన సాక్షి, ఆరోగ్యం:

అసలే ఎండాకాలం. చల్లదనాన్ని కోరుకునే శరీరం. వేసవి కాలంలో విరివిగా అమ్ముడయ్యే పండ్లలో పుచ్చకాయ ఒకటి. పుచ్చకాయ కొనుగోలు చేసేటప్పుడు ఆదమరిస్తే రుచిలేని పండుని అంటగట్టే అవకాశం ఉంటుంది. ఒక మంచి పుచ్చకాయను ఎంచుకోవడానికి మచ్చలు, ఆకారం, బరువు, గట్టిదనం, చర్మం పొడి స్వభావం తదితర అంశాలను ప్రభావితం చేస్తాయి.

పుచ్చకాయ అంటే బయట పచ్చని పొట్టు, లోపల తెల్లని పొర, మధ్యలో ఎర్రని గుజ్జు మరియు నల్లని గింజలతో కనువిందు చేసే పండు. దుకాణానికి వెళ్లి పుచ్చకాయ కొనాలనుకున్నప్పుడు, లోపల ఎరుపు రంగు ఉందా అనే అనుమానం కలుగుతుంది. అందుకే చాలామంది దుకాణదారుని ఒక చిన్న ముక్క కోసి చూపమని కోరతారు.

అది ఎర్రగా కనిపిస్తే కొంటాము, కానీ పండు కోసిన రెండు గంటల్లో తినకపోతే అది చెడిపోతుంది. అయితే, పుచ్చకాయను కోయకుండానే దాని నాణ్యతను ఎలా అంచనా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

1. తెల్లని మచ్చలు

కొన్ని ప్రత్యేకమైన పుచ్చకాయలపై తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. ఇలాంటి పండ్లు చాలా తియ్యగా ఉంటాయి. లోపల భాగం గాఢమైన ఎరుపు రంగును కలిగి ఉంటుంది.

2. ఆకారం

పుచ్చకాయ ఆకారం కూడా ముఖ్యం. అది గుండ్రంగా లేదా గుడ్డు ఆకారంలో ఉంటే తీసుకోవచ్చు. ఇలాంటి ఆకారం ఉన్నవి సమానంగా పండి, గింజలు క్రమంగా అమరి ఉంటాయి.

3. బరువు

బరువైన పుచ్చకాయ ఎల్లప్పుడూ రుచిగా ఉంటుంది. కనీసం 2 కిలోల బరువు ఉన్నది తీసుకోండి. ఇలాంటి వాటి లోపల మెత్తగా, జ్యూసీగా ఉంటాయి. చిన్న పుచ్చకాయలకు ఈ లక్షణం ఉండదు.

4. గట్టిదనం

పండు గట్టిగా ఉండాలి, ఎక్కడా మెత్తగా అనిపించకూడదు. మెత్తని భాగాలు ఉంటే అది చెడిపోయినట్లు లెక్క. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువ కాబట్టి, కొన్న రెండు రోజుల్లో తినేయడం మంచిది.

5. పొడి చర్మం

పుచ్చకాయ చర్మం పొడిగా, కొంచెం వాడినట్లు ఉండాలి. పచ్చగా, లేతగా ఉంటే అది పక్వానికి రాలేదని అర్థం. అలాంటి పండు లోపల ఎర్రగా ఉండదు.

6. పసుపు రంగు

కొన్ని పుచ్చకాయలకు ఒక వైపు పసుపు రంగు మచ్చ ఉంటుంది. ఇది నేలకు ఆనుకుని పండినప్పుడు ఏర్పడుతుంది. లోపల ఎరుపు రంగులో ఉంటుంది. ఈ భాగం కొంచెం మందంగా ఉంటుంది.

Reporting : Vishal, Hyderabad 

MOST READ : 

  1. TG News : సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి.. ఏంటి ఈ వ్యాధి.. ఎవరికి వస్తుంది.. అవగాహణ..!

  2. Aeroplane: విమానంలో తీసుకెళ్లే నగదుకి పరిమితులున్నాయా.. ఏవి తీసుకెళ్లొద్దో తెలుసుకుందాం..!

  3. District Collector : అధికారులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. పనితీరు మెరుగుపర్చుకోకపోతే చట్టపరమైన చర్యలు..!

  4. Rythu award : రైతుకు జాతీయస్థాయి ఆవిష్కర్త అవార్డు.. అభినందించిన అదనపు కలెక్టర్ వేణు..!

మరిన్ని వార్తలు