తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లావిద్య

Applications : బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కోసం ధరఖాస్తుల ఆహ్వానం..!

Applications : బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కోసం ధరఖాస్తుల ఆహ్వానం..!

పెద్దపల్లి, మన సాక్షి :

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంపిక కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి బి.వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి జిల్లాల్లోని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కి రెసిడెన్షియల్ అండ్ నాన్ రెసిడెన్షియల్ పథకంలో భాగంగా ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేయడానికి పెద్దపల్లి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుందని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి తెలిపారు.

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కి రెసిడెన్షియల్ పథకంలోని విద్యార్థులకు ట్యూషన్, హాస్టల్ వసతి, భోజనంతో పాటు రెండు జతల దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలకు గాను విద్యార్థికి 42 వేల చొప్పున, నాన్ – రెసిడెన్షియల్ పథకంలోని విద్యార్థులకు ట్యూషన్ తో పాటు రెండు జతల దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలకు గాను ప్రతీ విద్యార్థికి 28 వేల చొప్పున చెల్లించబడుతుందనీ తెలిపారు.

దరఖాస్తు ఫారముల కొరకు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయము పెద్దపల్లి యందు సంప్రదించాలని, పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను మే 24 లోగా కార్యాలయములో అందించాలని, ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి బి.వినోద్ కుమార్ ఆ ప్రకటనలో కోరారు.

MOST READ : 

  1. Nalgonda : 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు..!

  2. Fire Accident : హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం..!

  3. Gold Price : లక్షకు దిగువన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

  4. District additional Collector : జిల్లా అదనపు కలెక్టర్ కీలక ఆదేశం.. రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు సెంటర్ క్లోజ్ చేయాలి..!

  5. Viral Video : భార్యను తలకిందులుగా వేలాడదీసిన భర్త.. (వైరల్ వీడియో)

మరిన్ని వార్తలు