Breaking Newsతెలంగాణరాజకీయం

TG News : కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్దమైందా..?

TG News : కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్దమైందా..?

మన సాక్షి, వెబ్ డెస్క్:

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం అయ్యిందా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలో కేటీఆర్ మాట్లాడుతూ ఆయన నోట అరెస్టు మాట వచ్చింది. అది కాస్త ఇప్పుడు సంచలనంగా మారింది.

అంతకు ముందు రోజే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అరెస్టు బాంబు పేల్చిన విషయం తెలిసిందే. కొంతమంది అరెస్టులకు సిద్ధమైనట్లు, అక్రమార్కులను వదిలి పెట్టేది లేదని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో కేటీఆర్ నోట అరెస్టు మాట వచ్చిందా..? అరెస్టు చేసి జైల్లో పెట్టినా తాను సిద్ధమే.. అంటూ కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

అంతే కాకుండా తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసే పోలీస్ అధికారులకు కూడా మిత్తితో సహా చెల్లిస్తామని సంచలనంగా ఆయన ప్రకటించారు. అయితే ఆయన అరెస్టు విషయం మాట్లాడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ కు ఏమైనా ముందే సమాచారం ఉందా..? అనేది చర్చగా మారింది.

10 సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డిని  అనేక ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలపై కూడా అనేక రకాల కేసులకు  గురయ్యారు.

అయితే ఒకవేళ కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశాలు ఉంటే ఆయనకు ముందుగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేస్తారా..? అనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా కేటీఆర్ పై  సాక్షాలను సేకరించిన అనంతరమే అరెస్టు చేస్తారు. అనేది రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

MOST READ : 

మరిన్ని వార్తలు