తెలంగాణBreaking Newsరాజకీయం

రైతు భరోసా ఇచ్చే ఉద్దేశ్యం ఉందా.. రుణమాఫీ లెక్కనేనా.!

రైతు భరోసా ఇచ్చే ఉద్దేశ్యం ఉందా.. రుణమాఫీ లెక్కనేనా.!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి 9 మాసాలు గడిచింది. అయినా కూడా ఇప్పటివరకు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించలేదు.

గత యాసంగి సీజన్ లో రైతు భరోసా ప్రారంభించకుండానే గత ప్రభుత్వం మాదిరిగానే రైతుబంధు పేరుతో ఎకరానికి పదివేల రూపాయలకు పెట్టుబడి సహాయంగా అందజేశారు. వానాకాలం సీజన్ వచ్చేటప్పటికి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి ఎకరానికి 15000 పెట్టుబడి సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.

కానీ వానాకాలం సీజన్ ప్రారంభమై సగం రోజులు కూడా గడిచింది. ఇంకా కొద్దిరోజులే వానా కాలం సీజన్ ఉంది. రైతులకు వాస్తవానికి పెట్టుబడి సహాయం కోసం జూన్ జూలై మాసంలోనే అందజేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు రైతు భరోసా పథకం ప్రారంభించలేదు. రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందలేదు.

దాంతో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వానాకాలం సీజన్ అయిపోవడానికి ఇంకా 21 రోజులే ఉంది. రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్..? అంటూ ప్రశ్నించారు. రైతు భరోసా ఇచ్చే ఉద్దేశం ఉందా.. లేక ఇది కూడా రుణమాఫీ లెక్కనేనా అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు.

LATEST UPDATE : 

Viral : ఉపాధ్యాయ దినోత్సవం రోజు టీచరమ్మ డ్యాన్స్.. నేటిజెన్ల కామెంట్స్ చూస్తే.. (వీడియో)

Heavy Rain : ఆత్మహత్యే శరణ్యం.. కౌలు రైతు కుటుంబం ఆవేదన..!

UPI : యూపీఐ పేమెంట్ ల ద్వారా మోసాలు.. 13 మంది ముఠా అరెస్ట్..!

Runamafi : రుణమాఫీ కాని వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు