Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsఖమ్మం జిల్లాతెలంగాణవ్యవసాయం

Heavy Rain : ఆత్మహత్యే శరణ్యం.. కౌలు రైతు కుటుంబం ఆవేదన..!

Heavy Rain : ఆత్మహత్యే శరణ్యం.. కౌలు రైతు కుటుంబం ఆవేదన..!

నేలకొండపల్లి, మన సాక్షి :

ఆరుగాలం కష్టపడి పండించిన పంట మరి కొద్ది కాలంలో పంట చేతికి రానుంది.. అందు కోసం అందినకాడికల్లా అప్పులు తెచ్చి…కౌలు కు తీసుకుని సాగు చేసిండు..ప్రకృతి భీభత్సవం కు మొత్తం కొట్టుకపోయి..దుమ్ము మిగిలింది. పెట్టుబడి నీటిపాలైంది. ప్రభుత్వం ఆదుకోకపోతే నాకు దిక్కులేదు…నాకు చావే దిక్కు అంటూ ఓ. కౌలు రైతు ఆవేదన ఇది.
ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని మంగాపురంతండా కు చెందిన తేజావత్ బాబురావు కౌలు రైతు చెరువుమాధారం చెరువు కింద నాలుగు ఎకరాలు కౌలు కు తీసుకుని వరి సాగు చేశారు. ఇప్పటికే రెండు పర్యాయాలు మందు చల్లిండు, రెండు సార్లు మందు పిచికారి చేసిండు.. సాగు కు దాదాపు రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు.

వరి కూడ చాలా ఏపుగా పెరిగింది. బిర్రు పొట్ట దశలో ఉంది. మరి కొంత కాలం అయితే పంట చేతికి వస్తుందని ఆశపడ్డాడు. కానీ ప్రకృతి కోపం కు ఓ గిరిజన కౌలు రైతు బిడ్డ దారుణంగా నష్టపోయాడు. నాలుగు ఎకరాల పంట కూడ పూర్తిగా కొట్టుకపోయింది.

పొలం నిండా రాళ్లు, ఇసుక మేటలు దర్శనమిస్తున్నాయి. దీంతో కౌలు రైతు కుటుంబం బోరున విలపిస్తున్నాడు. కేవలం కౌలు సాగు మీద జీవనం సాగిస్తున్న కుటంబం పై ప్రకృతి పిడుగు వేసినట్లు గా మారింది. సదరు రైతు కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

జరిగిన నష్టంను ఎలా భర్తీ చేయాలి. కౌలు ఎలా తీర్చాలి అనే మనో వేదన తో మధనపడుతున్నాడు. ప్రభుత్వం అండ కోసం ఆశగా పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తనకు చావు తప్ప మరోకటి లేదని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

LATEST UPDATE : 

Good News : మహిళలకు భారీ శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..!

Runamafi : రుణమాఫీ కాని వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక ప్రకటన..!

BIG BREAKING : మాదాపూర్ లో ఉద్రిక్తత.. కిరోసిన్ పోసుకొని కుటుంబం ఆత్మహత్యాయత్నం..!

బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?

మరిన్ని వార్తలు