మెదక్ జిల్లాలో దారుణం.. దిష్టి తీసిన వస్తువులు రోడ్డుమీద వేశారని, ఊరు నుంచే..!
మెదక్ జిల్లాలో దారుణం.. దిష్టి తీసిన వస్తువులు రోడ్డుమీద వేశారని, ఊరు నుంచే..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
మెదక్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. దిష్టి తీసిన వస్తువులను రోడ్డు మీద వేశారని గ్రామస్తులు.. ముగ్గురిపై దాడి చేయగా ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. మెదక్ జిల్లాలో మంగళవారం దారుణమైన సంఘటన చోటుచేసుకుంది.
మెదక్ జిల్లా టెక్మల్ గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లగూడెంలో చేతబడి చేస్తున్నారనే నెపంతో గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా కొల్చారం మండలం మందాపూర్ గ్రామానికి చెందిన రాములు (65)కు అనారోగ్యం కావడంతో టేక్మాల్ పిహెచ్సి తోపాటు మరో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించి ఇంటికి తీసుకొచ్చారు. అయినా కూడా అతను అనారోగ్యంగా ఉండడంవల్ల మంగళవారం తెల్లవారుజామున బాలమణి రాములకు దిష్టి తీసి ఆ వస్తువులను రోడ్డు వద్ద ఉంచారు.
కాగా అది గమనించిన గ్రామస్తులు కోపోద్రిక్తులై వారిద్దరితో పాటు మరో మహిళను ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి విచక్షణ రహితంగా దాడి చేశారు. ఆ తర్వాత ఊరు నుంచి వెళ్ళిపోవాలని హుకుం జారీ చేశారు. ముగ్గురు జోరు వానలో ఓ చెట్టు కింద చేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరి వారిని ఆసుపత్రికి తరలించారు.
అనారోగ్యంతో ఉన్న వ్యక్తి అప్పటికే మృతి చెందగా మరో ఇద్దరి మహిళలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అతని కుమారుడు శివకుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
LATEST UPDATE :
Holidays : ఈ నెలలో ఆ రెండు రోజులు సెలవులు.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!
మిర్యాలగూడ : మోడల్ స్కూల్, కస్తూర్బా స్కూల్ ఓకే చోట.. సౌకర్యాలు లేక విద్యార్థినిల అవస్థలు, ధర్నా..!
Cm Revanth Reddy : తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!
Real Heroes : రియల్ హీరోస్.. రాత్రి, పగలు కష్టపడి వరదలో చిక్కిన పదిమందిని కాపాడిన పోలీసులు..!









