Khammam : జనసేవా దళ్ శిక్షణ ప్రారంభం..!

Khammam : జనసేవా దళ్ శిక్షణ ప్రారంభం..!
ఖమ్మం, మన సాక్షి:
యువతలో శారీరక ధృడత్వంతో పాటు మానసిక పరివర్తన, సమాజం పట్ల అవగాహన అవసరమని సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం నుండి ముఖ్య అతిథిగా హాజరైన ఇన్ స్పెక్టర్ కె. మురళి కృష్ణ తెలిపారు. సమకాలిన పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ సైద్దాంతిక శిక్షణ పొందాలని ఆయన -సూచించారు.
ఖమ్మం ఖమ్మం రూరల్ ఏదులాపూరం మున్సిపల్ పరిధిలో జనసేవా దళ్ శిక్షణా శిబిరం ఆదివారం ప్రారంభమైంది. శిక్షణను సిపిఐ జిల్లా కార్యదర్శి సురేష్, కె. మురళి కృష్ణ ప్రారంభించారు. ముందుగా ఏఐవైఎఫ్ జెండాను సిపిఐ ఖమ్మం జిల్లా సమితి సభ్యులు చెరుకుపల్లి భాస్కర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దండి సురేష్, కె మురళి కృష్ణ మాట్లాడుతూ జనాభాలో సగానికి పైగా కలిగిన యువత పాలక వర్గాల తీరుతో నైరాశ్యానికి గురవుతుందన్నారు. ఉపాధి, ఉద్యోగాల కల్పనలో పాలకులు -విఫలం కావడంతో యువశక్తి నిర్వీర్యమవుతుందన్నారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో యువత చైతన్యవంతమైన ఆలోచనలతో రాజకీయాల్లోకి రావాలని వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులకు మద్దతుగా నిలవాల్సి ఉందన్నారు. నిరుద్యోగం పెరిగిన -నేపథ్యంలో పాలకులు కర్మ సిద్దాంతాన్ని బోధిస్తూ పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తెలిపారు.
సుదీర్ఘ కాలం పోరాటాలతో అనేక హక్కులను, సంక్షేమ పథకాలను సాధించిన భారత కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవ ముగింపు ఉత్సవాలను జనవరి 18న ఖమ్మంలో జరుపుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఐదువేల మంది యువకులకు జన సేవాదళ్ శిక్షణ ఇస్తుమన్నారు.
శారీరకంగా ధృడత్వం కలిగి ఉన్నప్పుడే మానసిక పరిపక్వత లభిస్తుందని శారీరక ధృడత్వం కలిగి సమాజ ఉన్నతికి కృషి చేయాలని ఆయన యువతను కోరారు. భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రను నేటి తరానికి తెలియజేస్తూ సమస్యలపై జరిగే పోరాటాలకు సంబంధించి కార్యోన్ముఖులను చేయడమే లక్ష్యంగా శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నామని దండి సురేష్, కె. మురళి కృష్ణ తెలిపారు.
ఈకార్యక్రమంలో సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు మిడకంటి చిన్న వెంకట రెడ్డి, సిపిఐ ఖమ్మం జిల్లా సమితి సభ్యులు వెంపటి సురేందర్, సిపిఐ రూరల్ మండల కన్వీనర్ దండి రంగరావు, సిపిఐ ఖమ్మం రూరల్ మండలం నాయకులు వెన్నం భాస్కర్ మిడకంటి పెద్ద వెంకట్ రెడ్డి,
రైతు సంఘం నాయకులు మామిడి శంకర్ రెడ్డి, 31వ డివిజన్ కార్యదర్శి దొంతగని వెంకన్న, మండల నాయకులు గణపరపు వీరన్న, రైతు సంఘం సీనియర్ నాయకులు మామిండ్ల నిరంజన్ రెడ్డి,మండల నాయకులు పొన్నెకంటి రామకృష్ణ, ఏఐవైఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి నానాబాల రామకృష్ణ, ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు గణపారపు ఉపేందర్, ఏఐవైఎఫ్ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి,
మండల ఏఐవైఎఫ్ నాయకులు మామిడాల కిరణ్, ఏఐవైఎఫ్ నాయకులు దొంతగాని ఉపేందర్, మండల ఏఐవైఎఫ్ సహాయ కార్యదర్శి, రెడ్డబోయిన వెంకటేష్ 31వ డివిజన్ సహాయ కార్యదర్శి, దండి రమేష్ ఏఐవైఎఫ్ మండల నాయకులు, మెల్లెచెరువు రవి,ఎఐటియుసి జిల్లా నాయకులు మెల్లెచెరువు గురవయ్య, మేళ్ళచెరువు సాయి ఏఐవైఎఫ్ మండల నాయకులు, మిడికంటి అభిరామ్ రెడ్డి ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.









