Breaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

Jeevan Reddy : కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి గుడ్ బై.. ఖర్గేకు రాజీనామా లేఖ..!

సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. జగిత్యాల లోని తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తన అనుచరుల సమక్షంలో రాజీనామా చేస్తున్నట్లు తన నిర్ణయాన్ని వెల్లడించారు.

Jeevan Reddy : కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి గుడ్ బై.. ఖర్గేకు రాజీనామా లేఖ..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. జగిత్యాల లోని తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తన అనుచరుల సమక్షంలో రాజీనామా చేస్తున్నట్లు తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఆయన పట్ల అధిష్టానం వ్యవహరించిన తీరుకు తీవ్ర మనస్థాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. 40 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ.. పార్టీకి అండదండగా ఉన్న తనను కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పార్టీలోకి చేర్చుకోవడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా ఆయనను పార్టీ నుంచి వీడవద్దని మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టి పి సి సి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా ఆయన తనకు పార్టీ చేసిన అన్యాయం గురించి ప్రస్తావిస్తూ ఎవరి మాట వినలేదు. దాంతో పార్టీకి రాజీనామా చేశారు.

మల్లిఖార్జున ఖర్గేకు రాసిన లేఖ సారాంశం :

Telangana రాష్ట్ర Congress Party, ప్రత్యేకించి JAGTIAL శాసన సభ నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలను, నేను 24-10-2024 రోజున లిఖిత పూర్వకంగా, Congress Party అధిష్టానానికి, గౌరవ A.I.C.C. అధ్యక్షులు Sri Mallikarjuna Kharge గారికి మరియు అఖిల భారత కాంగ్రెస్ నాయకులైన Smt.Soniya Gandhi గారు, Sri Rahul Gandhi గార్లతోపాటు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి A.Revanth Reddy గారితోపాటు, రాష్ట్ర Congress Party అధ్యక్షులు B. Mahesh Kumar Goud గారికి సవివరంగా వివరిస్తూ,

భవిష్యత్ కార్యాచరణ గురించి, మార్గదర్శకం చేసేవిధంగా విజ్ఞప్తి చేయబడి, సంవత్సర కాలంపైగా గడిచినప్పటికి, ఇంతవరకు ఏవిధమైన స్పందన లేకపోవటమేకాకుండ, దశాబ్ద కాలం వివిధ హోదాలతో ఆనాటి B.R.S. ప్రభుత్వం శాసన సభలో, శాసన మండలిలో ఏకపక్షంగా పోరాటం చేసినప్పటికి, Congress Partyలో తగిన గుర్తింపు, ప్రాధాన్యత కల్పింపలేకపోవటానికితోడు, నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వపరంగా Nominated Postలన్నింటిలో కూడా ఫిరాయింపు M.LA. సలహా, సూచనల మేరకే నియామకాలు చేయటానికితోడు,

చివరికి Municipal ఎన్నికల సందర్భంలో రాష్ట్ర Congress కార్యాలయం GANDHI BHAVANలో నిర్వహింపబడిన సమావేశానికి, ఒకవైపు Speaker గారి పరిధిలో ఫిరాయింపు అంశానికి సంబంధించి, విచారణ కొనసాగింపబడుతున్న తరుణంలో ఫిరాయింపు B.R.S.M.L.A. అయిన M.Sanjay Kumar గారిని ఆహ్వానించటం, ప్రత్యక్షంగా రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించటముతో, జాతీయ స్థాయిలో Sri. Rahul Gandhi.. JAI BHIM, JAI BAPU, JAI SAMVIDHAN నినాదాన్ని, రాజ్యాంగ నిబంధనలను నీరు గారుస్తుండటాన్ని జీర్ణించుకోలేక, సమావేశం నుండి నేను మనస్థాపానికి గురి అయి, Walkout చేసే పరిస్థితి ఏర్పడటం బాధాకరం.

తదుపరి Municipal Councillor అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కూడా, 50 స్థానాలకుగాను, 30 స్థానాల అభ్యర్థులకుపైగా Congress Party కి సంబంధంలేని ఫిరాయింపు M.L.A. ప్రతిపాదనలకు అనుగుణంగా నిర్ణయించటముతో, విధిలేని పరిస్థితులలో, ఆరంభం నుండి Congress Party బలోపేతం కొరకు, నిర్మాణాత్మకంగా కృషి చేస్తున్న కార్యకర్తలకు అండగా నిలిచి, స్వతంత్రులుగా పోరాటం చేసినప్పటికి, గెలిచిన అభ్యర్థులందరు కూడా, Congress Party కి అండగా నిలువగా కూడా,

గత శాసనసభ మరియు Parliament ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన వారిని కాకుండ, ఫిరాయింపు M.L.A సూచనకు అనుగుణంగా Municipal Chairperson అభ్యర్థిని ఎంపిక చేయటంతోపాటు, మరియు గడిచిన 20 మాసాల నుండి కూడా, నియోజకవర్గ స్థాయిలో ఏకపక్షంగా ఫిరాయింపు M.L.A.కు ప్రభుత్వపరంగా, పార్టీపరంగా ప్రోత్సాహం కల్పిస్తుండటంతో ఆరంభం నుండి దశబ్దాల తరబడి, Congress Party జెండా నీడన ఉన్న కార్యకర్తలు నిరాశ, నిస్పృహలకు లోను కావటంతో, స్వయంగా నేను కూడా, గత 20 మాసాల నుండి అనుభవిస్తున్న మానసిక క్షోభను అధిగమించలేక చివరికి, Congress Party వీడే పరిస్థితి ఏర్పడటం బాధాకరం అయినప్పటికి నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని వీడి, Congress Party ని వీడుతూ A.I.C.C. సభ్యత్వంతోపాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో Congress Party పరంగా, నాకు కల్పించిన వివిధ హెూదాలు, బాధ్యతలు మరియు గుర్తింపునకు ధన్యవాదాలు.

మరిన్ని వార్తలు