Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

JNTU : జేఎన్‌టీయు విద్యార్ధి ఆత్మహత్య.. బయటపడని ఆత్మహత్యకు కారణాలు..!

JNTU : జేఎన్‌టీయు విద్యార్ధి ఆత్మహత్య.. బయటపడని ఆత్మహత్యకు కారణాలు..!

అందోలు, మనసాక్షిః

సంగారెడ్డి జిల్లా చౌటాకూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌ లోని జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ సీఎస్‌ఈ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి తన హాస్టల్‌ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం అనుమానాలకు దారితీసింది. జేఎన్‌టీయులోని 304 హస్టల్‌ గదిలో ఉంటున్న బానోత్‌ మనోహర్‌ (19) శుక్రవారం ఎప్పటిలాగే తరగతులకు హజరై మద్యహ్న బోజనం చేసి గదిలోకి వెళ్లిపోయాడు.

గదిలో రెండు తవాల్‌లను ఒకే దగ్గర ముడివేసి ఫ్యాన్‌కు కట్టి ఉరివేసుకున్నాడు. స్నేహితులు వచ్చి డోర్‌ తట్టినా, ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో సాత్విక్‌ రెడ్డి డోర్‌పైన ఉన్న చిన్న కిటికిలో నుంచి చూడగా ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. అతడు గట్టిగా అరవడంతో అదే ఫ్లోర్‌లో ఉన్న అభి అనే విద్యార్థి వచ్చి ఇద్దరు డోర్‌ను గట్టిగా తన్ని తీసారు.

వెంటనే ఈ విషయాన్ని సిబ్బందికి తెలియజేయడంతో ప్రిన్సిపాల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే కాలేజీ అంబులెన్స్‌లోనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమద్యలోనే విద్యార్థి మృతి చెందినట్లుగా చెబుతున్నారు. మృతుడు విద్యార్ధిది సూర్యాపేట జిల్లా రుద్రాతాండా, మోతే ప్రాంతానికి చెందిన వాడని కళాశాల ప్రిన్సిపాల్‌ తెలిపారు.

ఆత్మహత్యకు కారణాలేమిటీ?

కళాశాలలో మంచి చురుకైన విద్యార్ధి, బాగా చదువుకునే విద్యార్ధి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని కళాశాల సిబ్బంది, తోటి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయంటే వారి సోదరుడు అలాంటివేమి లేవని ఫోన్‌లో తెల్పడంతో ఆత్మహత్యకు బలమైన కారణాలు ఏమై ఉంటాయన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సెల్‌ఫోన్‌ ఆధారంగానే చావుకు కారణాలు తెలియవచ్చుని వారు బావిస్తున్నారు.

ఉదయమే కళాశాల నుంచి బయటకు వెళ్లి సినిమాకు వెళ్లినట్లు చెబుతున్నారు. ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్డీఓ పాండు, పుల్కల్‌ తహసీల్దారులు కళాశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

విచారణ చేపడుతున్నాంః డీఎస్‌పీ సత్తయ్యగౌడ్‌

కళాశాల హస్టల్‌ గదిలో మృతుడి సెల్‌ఫోన్‌ను స్వాధీనపరచుకున్నాం. చివరగా కుటుంబ సభ్యులతోనే మాట్లాడినట్లు ఉందని డీఎస్‌పీ సత్తయ్య గౌడ్‌ అన్నారు. కుబుంబ సభ్యులతో మాట్లాడితే ఏమి ఇబ్బందులు లేవని తెలిపారని ఆయన అన్నారు. ఏమైనా మెస్సేజ్‌లు, కాల్స్‌ మాట్లాడి డిలేట్‌ చేసిన కోణంలో కూడా విచారణ జరుపుతాం. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగిస్తాం. జోగిపేట సీఐ అనీల్‌కుమార్, పుల్కల్‌ ఎస్‌ఐలు వెంట ఉన్నారు.

MOST READ : 

  1. Accident : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. గుర్తు తెలియని వ్యక్తి మృతి..!

  2. Mahabubabad : దారుణం.. బతికుండగానే మార్చురీలో పెట్టి తాళం వేశారు..!

  3. TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. రేపు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే..!

  4. Wines Tenders : ఒకే ఒక్క టెండర్ వేశాడు.. చనిపోయాడు.. డ్రా లో అతడికే దక్కిన షాప్.. ఎవరికి కేటాయిస్తారు..!

మరిన్ని వార్తలు