Breaking NewsTOP STORIESఉద్యోగంజాతీయం
SBI : ఎస్బిఐలో పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఉద్యోగాలు.. గడువు లేదు త్వరపడండి..!

SBI : ఎస్బిఐలో పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఉద్యోగాలు.. గడువు లేదు త్వరపడండి..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా కాంట్రాక్టు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం దేశవ్యాప్తంగా 996 కాంట్రాక్టు పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో హైదరాబాదులో 43, అమరావతిలో 29 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు గాను ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక చేయనున్నారు. అర్హత ఉన్న వారు వెంటనే త్వరపడి దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్నది. అందుకుగాను డిగ్రీ లేదా ఎంబీఏ పూర్తి చేసిన వారు పని అనుభవంతో పాటు డిసెంబర్ 23వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ఎంపికను షార్ట్ లిస్టింగ్ చేసి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు sbi.bank.in చూడాల్సి ఉంది. ఈ ఉద్యోగాలకు నిర్దిష్ట పోస్టును బట్టి అభ్యర్థులకు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాల్సి ఉంటుంది.









