ఎన్నికల్లో జాయింట్ కిల్లర్..!
ఎన్నికల్లో జాయింట్ కిల్లర్..!
ఉద్దండలను ఓడించిన వెంకటరమణారెడ్డి
కామారెడ్డి, మన సాక్షి :
తెలంగాణలో సాధారణ ఎన్నికల్లో జాయింట్ కిల్లర్ గా బిజెపి అభ్యర్థి వెంకటరమణారెడ్డి నిలిచారు. కామారెడ్డిలో ఇద్దరు ఉద్దండులపై 6000 ఓట్లపైగా మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు. బిఆర్ఎస్ తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేయగా, కాంగ్రెస్ తరపున పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పోటీ చేశారు.
కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డి లోను పోటీ చేయగా, రేవంత్ రెడ్డి కొడంగల్ తో పాటు కామారెడ్డి లోను పోటీ చేశారు. కాగా బిజెపి తరఫున పోటీ చేసిన వెంకటరమణారెడ్డి స్థానికంగా ఓటర్లకు దగ్గరగా ఉండటం వల్ల ఆయన పోటీ చేసి ఇద్దరి ఉద్దండలపై విజయం సాధించి సాధించారు.
ALSO READ : మీసం తిప్పాడు.. విజయం సాధించాడు, రేవంత్ స్టైలే వేరు..!
6 వేల ఓట్లపైగా మెజారిటీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. కొడంగల్ నుంచి వచ్చే బస్సు కొడంగల్ డిపోకు వెళ్తుంది… గజ్వేల్ నుంచి వచ్చే బస్సు కొడంగల్ డిపోకు వెళ్తుంది.. కానీ తాను లోకల్ ఇక్కడే ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలు కూడా స్థానికున్ని గెలిపించాలని వెంకట్రామిరెడ్డికి ఓట్లు వేసి గెలిపించారు.
కామారెడ్డి ప్రజలు విలక్షణమైన తీర్పును ఇచ్చి స్థానికుడిని గెలిపించుకున్నారు. తమకు ముఖ్యమంత్రి వద్దు.. కాబోయే ముఖ్యమంత్రి వద్దు.. మాకు స్థానికుడు ఉంటే మా సమస్యలు పరిష్కారం అవుతాయని కామారెడ్డి ప్రజలు తీర్పు ఇచ్చి రికార్డు సృష్టించారు. ఇద్దరి ఉద్దండలను ఓడించిన జాయింట్ కిల్లర్ గా వెంకటరమణారెడ్డి చరిత్రలో నిలిచారు.









