Nalgonda : గత జ్ఞాపకాలతో వెల్లువిరిసిన ఆనందం.. ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం..!
Nalgonda : గత జ్ఞాపకాలతో వెల్లువిరిసిన ఆనందం.. ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం..!
నల్లగొండ, మన సాక్షి ;
నల్లగొండ పట్టణంలోని ఐఎంఏ భవనంలో ఆదివారం మమత స్కూల్ 1991- 92 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మమతా స్కూల్ కరస్పాండెంట్ యానాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పూర్వ విద్యార్థులంతా ఒక చోట కలుసుకోవడం చాలా సంతోషకరమన్నారు.
మమత స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థులు ప్రస్తుతం మంచి స్థాయిలో ఉండడం చాలా హర్షణీయమని అన్నారు. తమ పూర్వ విద్యార్థులు ఎల్లప్పుడూ మంచి స్థాయిలో ఉండాలని తాము కోరుకుంటామని అన్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం ద్వారా మంచి సంబంధాలు ఏర్పడతాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఎస్కే సలీం , రామ్మూర్తి , దాడి చంద్రశేఖర్ రెడ్డి, ప్రతాపరెడ్డి, యానాల రాధిక , ఉట్కూరి మధుసూదన్ రెడ్డి, దాడి సుధాకర్ రెడ్డి, శేఖర్ రెడ్డి , వెంకట్రామిరెడ్డి, పూర్వ విద్యార్థులు రెడ్డి పల్లి గిరి, నామిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, శ్రీపతి యాదయ్య , మహ్మద్ కవి, ఓర్సు వెంకటేశ్వర్లు, వరంగల్ కృష్ణ, సుభాష్ రెడ్డి, రబ్బానీ, రాజేందర్ రెడ్డి, అంశాల సత్యనారాయణ, రజిని, జ్యోతి , నిర్మల, కవిత,
పెద్ది శ్రీనివాస్ పాల్గొన్నారు.
MOST READ :
-
Miryalaguda : విద్యార్థులకు ఎన్నారై చేయూత..!
-
Rythu Bharosa : రైతు భరోసాకు నిబంధనలు.. మంత్రి తుమ్మల స్పష్టం.. విడుదలకు డేట్ ఫిక్స్..!
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు.. డేట్ ఫిక్స్.. ఆ రోజు పండుగే.. బిగ్ అప్డేట్..!
-
District collector : చెన్నై, బెంగళూరుకు అంజీర ఎగుమతి.. సాగు పరిశీలించిన జిల్లా కలెక్టర్.. ఆ రైతుకు సన్మానం..!
-
New Creature : పాక్షిక కనురెప్పలు, విభిన్న చారలతో పామును పోలిన కొత్త జీవి..!









