Breaking Newsతెలంగాణరాజకీయం
KCR : ముగిసిన కాళేశ్వరం కమిషన్ విచారణ.. కెసిఆర్ ఏం చెప్పారో..!
KCR : ముగిసిన కాళేశ్వరం కమిషన్ విచారణ.. కెసిఆర్ ఏం చెప్పారో..!
మన సాక్షి, హైదరాబాద్ :
కాళేశ్వరం కమిషన్ విచారణ బుధవారం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో ముగిసింది. సుమారు 50 నిమిషాల పాటు ఆయనను విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు ప్రశ్నలను కేసీఆర్ ను కమిషన్ చైర్మన్ ఘోష్ ప్రశ్నించారు. అయితే కమిషన్ చైర్మన్ కు కేసిఆర్ పలు డాక్యుమెంట్లను అందించారు. ఆ తర్వాత విచారణ ముగిసింది. విచారణ ముగిసిన అనంతరం కెసిఆర్ బి ఆర్ కె భవన్ ముందు కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.









