Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలువిద్య

Karimnagar : పారదర్శకంగా, పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు..!

కరీంనగర్జి ల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమైన నేపథ్యంలో పలు పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తనిఖీ చేశారు.

Karimnagar : పారదర్శకంగా, పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు..!

కరీంనగర్, మనసాక్షి:

కరీంనగర్జి ల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమైన నేపథ్యంలో పలు పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తనిఖీ చేశారు.

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (ఆర్ట్స్అండ్ కామర్స్) ముకరంపురాలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను, సీసీ కెమెరా వ్యవస్థను పరిశీలించారు.

విద్యార్థుల హాజరు శాతం, హాల్ టికెట్ల తనిఖీ, బందోబస్తు ఏర్పాట్లు తదితర విషయాలపై ఆరా తీశారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేలా చూడాలని అన్నారు. మాల్ ప్రాక్టీస్ కి ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జవాబు పత్రాల రవాణాకు పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరీక్షలు పూర్తయ్యేంతవరకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని అన్నారు.

ఒకేషనల్ కోర్సులు కలుపుకొని జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 15,389 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా మొదటిరోజు 400 మంది గైర్హాజరయ్యారు. 14,989 మంది పరీక్షలు రాశారు. మాల్ ప్రాక్టీస్ వంటి ఘటనలు ఏమీ చోటు చేసుకోలేదు.

MOST READ : 

మరిన్ని వార్తలు