Hyderabad : ఖజానా దొంగలు దొరికారు..!
Hyderabad : ఖజానా దొంగలు దొరికారు..!
శేరిలింగంపల్లి, మన సాక్షి
చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ దుకాణంలో పట్టపగలే దోపిడీ దొంగలు చోరీకి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దోపిడీకి పాల్పడ్డ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ చోరీ కేసు వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాకు వెల్లడించారు.
ఖజానా జ్యువెలరీ దుకాణంలో చోరీకి పాల్పడ్డ నిందితులంతా బీహార్‌కు చెందిన వారేనని తెలిపారు. గత రెండేండ్లుగా వీరు హైదరాబాద్‌లో నివాసం ఉంటూ కూలీ పనులు చేస్తున్నారు. ఇక ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీల బాట పట్టారు.
ఇందుకు చందానగర్ ఖజానా జ్యువెలరీ దుకాణం వద్ద 20 రోజుల పాటు రెక్కీ నిర్వహించి, చోరీకి పాల్పడ్డారు. నిందితులు ఏడుగురు కూడా బైక్‌పై వచ్చి బైక్‌లపైనే పారిపోయారని తెలిపారు. 10 కిలోల వెండి ఆభరణాలు, వస్తువులను దొంగలు అపహరించారు.
బంగారంగా భావించి బంగారం పూత పూసిన వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ బిహార్ ముఠా హైదరాబాద్‌లో చేసిన తొలి చోరీ ఇది. గతంలో కోల్‌కతా, బిహార్, కర్ణాటకలో దోపిడీలకు పాల్పడినట్లు గుర్తించామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు.
MOST READ :
-
TG News : రేషన్ కార్డుదారులకు శుభవార్త.. సెప్టెంబర్ నుంచి సన్న బియ్యం అలా పంపిణీ..!
-
Big Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన.. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్..!
-
District collector : ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో జాతీయ గీతం.. ఆలపించిన జిల్లా కలెక్టర్..!
-
Panchayat Electrons : పంచాయతీ ఎన్నికల పై కీలక అప్డేట్.. వారికి గుడ్ న్యూస్..!









