Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయం

Panchayat Electrons : పంచాయతీ ఎన్నికల పై కీలక అప్డేట్.. వారికి గుడ్ న్యూస్..!

Panchayat Electrons : పంచాయతీ ఎన్నికల పై కీలక అప్డేట్.. వారికి గుడ్ న్యూస్..!

మనసాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులకు గుడ్ న్యూస్ అందింది. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.

ఇప్పటికే ఓటర్ల జాబితా కూడా సిద్ధమైంది. ఇది ఇలా ఉండగా బ్యాలెట్ బాక్సులు రాష్ట్రానికి చేరాయి. గుజరాత్ నుంచి 37,530 బ్యాలెట్ బాక్సులు తెలంగాణకు వచ్చాయి. కాగా మరో రెండు రోజుల్లో బ్యాలెట్ బాక్స్ లను జిల్లాల వారీగా పంపిణీ చేయడానికి రాష్ట్రాన్ని ఎన్నికల సంఘం సిద్ధమైంది.

ఇది ఇలా ఉండగా విద్యా, ఉద్యోగ, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ చట్టసభల్లో ఆమోదించిన ఆర్డినెన్స్ ను గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించారు.

బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో పాటు బీసీ సంఘాలు ఢిల్లీలో ధర్నాలు కూడా చేశాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఈనెల 18వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ సమావేశం నిర్వహించి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

MOST READ : 

  1. Nagarjunasagar : నిండుకుండలా నాగార్జునసాగర్.. 24 గేట్లు ఎత్తి నీటి విడుదల..!

  2. Nalgonda : ఉదృతంగా మూసీ నది.. భీమారం కాజ్వే వద్ద పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!

  3. Rythu Bima : రైతు బీమా పథకంలో కీలక అప్ డేట్..!

  4. TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. కొత్తగా 10 మార్కెట్ యార్డులు.. ఎక్కడెక్కడంటే..!

మరిన్ని వార్తలు