Komatireddy Rajagopal Reddy : కోమటిరెడ్డి మరోసారి అదే మాట.. ఎంతటి పోరాటానికైనా సిద్ధం..!

Komatireddy Rajagopal Reddy : కోమటిరెడ్డి మరోసారి అదే మాట.. ఎంతటి పోరాటానికైనా సిద్ధం..!
సంస్థాన్ నారాయణపురం, మన సాక్షి:
సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో త్రిబుల్ ఆర్ రైతుల సమస్యలపై స్థానిక పంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ త్రిబుల్ ఆర్ లో భూములు కోల్పోతున్న చౌటుప్పల్ డివిజన్ రైతులు తొక్కని గడపలేదు. రాజగోపాల్ రెడ్డి గట్టివాడు కొట్లాడుతాడు అనే అభిప్రాయం మీకు ఉంది,
గతంలో మునుగోడు నియోజకవర్గంనికి నిధులు రాకపోతే రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ దగ్గర పెట్టానని,నా రాజీనామా వల్ల చౌటుప్పల్- నారాయణపూర్ రోడ్డు జరిగినది, చౌటుప్పల్ కి వంద పడకల ఆసుపత్రి,, గట్టుప్పల్ మండలం, చండూరు రెవిన్యూ డివిజన్, శివన్న గూడెం రిజర్వాయర్ భూమి నిర్వసితులకు డబ్బులు రావడం జరిగిందని తెలిపారు.
రాజీనామా చేస్తే మునుగోడు నియోజకవర్గంనికి ఇవన్నీ జరిగినాయి. నాకు హామీ ఇచ్చిన మాట వాస్తవం.. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తానన్నారు. ఆలస్యమైన సరే పర్వాలేదు నేను ఎదురు చూస్తాను.. నాకు ఓపిక ఉందనీ నాకు అన్యాయం జరిగిన పర్లేదు కానీ మునుగోడు ప్రజలకు మాత్రం అన్యాయం జరిగే పని చేసిన నా నిర్ణయం ఎంత దూరమైన పోతుందని మరో సారి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డిని ఇన్ఫ్లుసె చేయడం అనేది ఎవరి వల్ల కాదు.
ఎక్కడికి అక్కడ ప్రభుత్వ స్తంభిస్తేనే మీ సమస్య పరిష్కారం అవుతుందనీ మరొకసారి అవసరమైతే ఎంత త్యాగమైనా చేయడానికి రాజగోపాల్ రెడ్డి సిద్ధం.. మీరు కూడా సిద్ధంగా ఉండండి అని అన్నారు.
నేను ఉన్న పార్టీ రోలింగ్ పార్టీ , కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ను నియోజకవర్గానికి అన్యాయం జరిగితే నేను ప్రభుత్వంతో పోరాటడానికి సిద్ధంగా ఉన్నాను.. నేను లాలూచీపడి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి పదవి ఇస్తే చప్పుడు చేయకుంట కూర్చోను.
మా రైతుల అన్యాయం జరిగితే పదవి వద్దు పైసలు వద్దు నా ప్రాంత ప్రజల ముఖ్యమని చెప్తాను..
ఏలాంటి అనుమానం అవసరం లేదు,, నీకు మీకు న్యాయం జరిగేంతవరకు మీ వెంట నేను ఉంటానని త్రిబుల్ ఆర్ రైతులకు భరోసా ఇచ్చారు. 2018 లో చెప్పాను మళ్లీ చెప్తున్నా నేను మీ ఇంట్లో సభ్యుడిగా వచ్చాను.. మీ ఇంట్లో సమస్య ఉంటే దానికోసం పోరాడే వ్యక్తిని..
త్రిబుల్ ఆర్ అనేది పెద్ద విషయం,,, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవచ్చి మీకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తాను..ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుంది అంటే నేను ఎంత దూరమైన వెళ్తా ఎంత త్యాగమైనా చేసే ఎంత పోరాటానికైనా సిద్ధం అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కరెంటు శ్రీనివాస్ నాయక్ జిల్లా ఉపాధ్యక్షులు మందుల బాల కృష్ణ కార్యదర్శి ఎప్పుడు సతీష్, నోముల మాధవరెడ్డి, మాజీ ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్చందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జక్కలి ఐలయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉప్పల లింగస్వామి, ముద్ధంగుల నర్సింహ, అక్బర్ అలి, జైపాల్ రెడ్డి, రైతులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Yadadri : తాటి చెట్టుపై ప్రమాదం.. ప్రాణాలు తెగించి, గంటన్నర కష్టపడి కాపాడిన తోటి గౌడన్నలు..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనుల పరిశీలన..!
-
Paneer: పనీర్ తింటే మంచిదేనా.. సామర్థ్యం తెలుసుకోండి..!
-
Hyderabad : హైదరాబాద్‌లో కొత్త పరిశోధన, అభివృద్ధి కేంద్రం ప్రారంభం..!
-
Best Award : రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికైన వెల్దండి శ్రీధర్.. ఎవరో తెలుసా..!









