TOP STORIESBreaking Newsజాతీయం

Srisailam : కృష్ణమ్మ పరవళ్ళు.. శ్రీశైలంకు 3.26 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. Latest Update

Srisailam : కృష్ణమ్మ పరవళ్ళు.. శ్రీశైలంకు 3.26 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. Latest Update

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణానది పొంగుతోంది. కృష్ణా నదిపై ఉన్న జలాశయాలు అన్ని నిండుకుండలా మారాయి. శ్రీశైలం ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయిలో నిండడంతో పది గేట్ల ద్వారా నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేశారు. శ్రీశైలంకు వరద ఉధృతి ఇంకా తగ్గడం లేదు. ప్రస్తుతం ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు, తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 3, 26, 871 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది.

కాగా శ్రీశైలం కుడి ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ సరఫరా చేయడంతో పాటు పది గేట్లను ఎత్తి దిగువకు 2.76 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో 885 అడుగులకు గాను 883 అడుగుల నీరు ఉంది. 215 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం కు గాను 213 టీఎంసీల నీరు నిలువ ఉంది. వరద ఉధృతి తగ్గకుంటే అన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది.

సాగర్ లో పెరుగుతున్న నీటిమట్టం :

నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం వేగవంతంగా పెరుగుతుంది. రెండు సంవత్సరాల తర్వాత సాగర్ కు జలకళ వచ్చింది. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా జలాశయం అడుగంటింది. ఈ ఏడాది సరైన సమయానికి వర్షాలు పడడంతో జలాశయం లోకి భారీగా నీరు చేరుతుంది. నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 521 అడుగులకు చేరింది. దాంతో ఆగస్టు 2వ తేదీన ఎడమ కాలువకు పంటలకు నీటిని విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి : 

Srisailam : శ్రీశైలం 10 గేట్లు ఎత్తి నీటి విడుదల, సాగర్ కు 2.79 లక్షల క్యూసెక్కుల నీరు.. ఆగస్టు 2న ఎడమ కాలువకు నీటి విడుదల..!

District collector : రుణమాఫీ ఫిర్యాదుల విభాగం మండలాల్లో నిరంతరం నడిపించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

District collector : డంపింగ్ యార్డ్ లో ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆయిల్, ఇటుకల తయారీని పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

Cm Revanth Reddy: రైతులకు బిగ్ రిలీఫ్.. రూ.1350 కోట్లతో ఆ పథకం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన..!

మరిన్ని వార్తలు