తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nagarjunasagar : 16 క్రస్ట్ గేట్ల ద్వారా కొనసాగుతున్న కృష్ణమ్మ పరవళ్లు..!

Nagarjunasagar : 16 క్రస్ట్ గేట్ల ద్వారా కొనసాగుతున్న కృష్ణమ్మ పరవళ్లు..!

నాగార్జునసాగర్, మన సాక్షి :

కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు చేరుతుంది. దీనితో సాగర్ జలాశయం 16క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 129600 క్యూసెక్కుల నీటిని ఎన్ఎస్సీ అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నుండి నాగార్జునసాగర్ కు 174120 క్యూసెక్కుల పరదనీరు సాగర్ జలాశయానికి వచ్చి చేరుతుంది. వచ్చిన నీటిని వచ్చినట్లు వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనితో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 590 అడుగులవద్ద వీరు నిల్వవుంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3120450 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 3120450 టీఎంసీలు పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉంది.

ప్రధాన జలవిష్యుత్ కేంద్రం ద్వారా విద్యుజ్ ఉత్పత్తి చేపడుతూ 29,435 క్యూసెక్కుల నీటిని, కుడి కాలువ ద్వారా 6112 క్యూసెక్కులు వీటిని, ఎడమ కాల్వద్వారా 6173 క్యూసెక్కుల నీటినీ,ఎస్.ఎల్.బి.సి ద్వారా 2400 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ నుండి మొత్తం 159035 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

LATEST UPDATES : 

మరిన్ని వార్తలు