Video : చీ చీ అంత దారుణమా.. పనిమనిషి వంట గదిలో.. (వీడియో)
Video : చీ చీ అంత దారుణమా.. పనిమనిషి వంట గదిలో.. (వీడియో)
మన సాక్షి, వెబ్ డెస్క్:
కొందరి ఇళ్లలో బిజీ షెడ్యూల్ ఉన్నవారు పని మనుషులను ఏర్పాటు చేసుకుంటారు. వంట సైతం వారితోనే చేయిస్తుంటారు. ఇలా ఎక్కువగా శ్రీమంతుల ఇళ్లలో కనిపిస్తారు. అంతేకాకుండా ఆరోగ్యం బాలేని వారు సైతం పని మనుషులను ఏర్పాటు చేసుకుంటారు.
ఇంకా వృద్ధులు కూడా వారికి తోడుగా ఉండేందుకు పని మనుషులను పెట్టుకుంటారు. అలాంటి వారు కొందరు ఏళ్ల తరబడి పని చేస్తూ యజమానుల మెప్పు పొందుతుండే వారిని చూస్తాం.. కానీ ఓ పనిమనిషి దారుణమైన పనికి పాల్పడింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వెలుగు చూసి చూసింది.
ఇలాంటి సంఘటన చూసి అందరికీ ఒళ్ళు గగుర్పాటు వస్తుంది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఈ సంఘటన వెలుగు చూసింది. ఘజియాబాద్ లోని రిపబ్లిక్ సొసైటీలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో పనిమనిషి ఎనిమిదేళ్లుగా ఉంటుంది. ఇఅంట్లో వారికి ఆమె అంటే ఏంటో అభిమానం.
కాగా ఇటీవల ఆ ఇంట్లో వారు వరుసగా ఆసుపత్రి పాలవుతున్నారు. అనారోగ్యంతో ఇబ్బందులకు గురవుతున్నారు. అందరికీ కూడా లివర్ ఇన్ఫెక్షన్ సమస్య వచ్చింది. దాంతో వారు డాక్టర్ని సంప్రదించగా ఆహారంలో కల్తీ తో సమస్యలు వచ్చాయని డాక్టర్ స్పష్టం చేశాడు.
దాంతో ఆ వ్యాపారి కుటుంబ సభ్యులు బయట ఫుడ్ పూర్తిగా నిషేధించారు. ఇంట్లోనే ఫుడ్ తింటున్నారు. అయినా కూడా ఆ వ్యాపారి చిన్న కొడుకు ఆరోగ్యం కూడా చెడిపోయి ఆసుపత్రికి తరలించారు. దాంతో డాక్టర్ మరోసారి హెచ్చరించాడు.. కల్తీ ఆహారం తినడం వల్ల ఇలాంటి సమస్య వస్తుందని చెప్పాడు.
కాగా వారికి ఇంట్లో వంట మనిషిపై అనుమానం వచ్చింది. కాగా వంట ఇంట్లో ఏం జరుగుతుందో అని సీక్రెట్ గా ఫోన్ కెమెరా ఆన్ చేసి ఓచోట ఉంచి రహస్యంగా వీడియో సేకరించారు. ఆ వీడియో చూశాక ఆ వ్యాపారికి చెమటలు పట్టడంతో పాటు వాంతులు కూడా చేసుకున్నాడు. ఎంతో నమ్మకంగా ఎనిమిదేళ్లుగా పని చేస్తున్న వంట మనిషి ఇలా చేసింది ఏంటా అని షాక్ కు గురయ్యాడు.
అయితే ఆ వీడియోలో ఏముందంటే ఆమె ఒక వంట పాత్రలో తన మూత్రం పోసి అందులోనే పిండి కలిపి రొట్టెలు చేయడం రికార్డు అయింది. దాంతో ఆ వ్యాపారి వెంటనే ఆ వీడియో రికార్డును పోలీసులకు ఇచ్చి కేసు నమోదు చేయించాడు. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.
అయితే విషయం ఏంటంటే ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న ఆ వంట మనిషి ఆ ఇంట్లో వస్తువులు మాయమైపోతున్నావని వ్యాపారి భార్య ఏడాది క్రితం ఆమెపై సీరియస్ అయింది. అయినా కూడా ఆమెనే పనిలో పెట్టుకున్నారు. ఈ పగ మనసులో పెట్టుకొని ఇలాంటి దారుణానికి ఆమె తెగబడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
VIDEO :
UP के ग़ाज़ियाबाद में 8 साल से घर में काम करने वाली नौकरानी रीना पर आरोप है की वह किचन में ही बर्तन के अंदर मूत्र विसर्जन करके मूत्र में ही आटा गूंथ रोटी बनाती थी। वीडियो सामने आने के बाद नौकरानी रीना को गिरफ्तार कर लिया गया है बताया जा रहा है की पूरा परिवार कई साल से बीमार है।… pic.twitter.com/Zp8mxrzJCx
— ONN18 News (@onn18news) October 16, 2024
MOST VIRAL VIDEOS :
-
Viral Video : అయ్య బాబోయ్.. ఎంత అదృష్టవంతురాలో ఆమె.. (వీడియో)
-
Viral Video : కొత్త జంట ఫస్ట్ నైట్.. చీ చీ ఇలాంటి సన్నివేశాలు.. సోషల్ మీడియాలో వైరల్.. (వీడియో)
-
Viral Video : ప్రీవెడ్డింగ్ షూట్ లోనే అలా.. ఇదేం ఆత్రం రా నాయన.. (వీడియో)
-
Viral Video : భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు.. భార్య చేసిన పనికి షాక్.. (వీడియో)
-
Viral Video : ఏం.. టీచరమ్మ రా బాబు.. క్లాస్ రూమ్ లోనే పిల్లలతో.. (వీడియో)









