క్రీడలుBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా

Choutuppal : జాతీయస్థాయి కుంగ్ ఫూ, కరాటే పోటీలలో కృష్ణవేణి విద్యార్థుల ప్రతిభ..!

Choutuppal : జాతీయస్థాయి కుంగ్ ఫూ, కరాటే పోటీలలో కృష్ణవేణి విద్యార్థుల ప్రతిభ..!

చౌటుప్పల్, మన సాక్షి:

హైదరాబాదులోని సూరారం విఐపి ఫంక్షన్ హాల్లో ఇంటర్నేషనల్ టైగర్స్ కుంగ్ ఫూ ఆధ్వర్యంలో నిర్వహించిన 26వ జాతీయస్థాయి కుంగ్ ఫు, కరాటే పోటీలలో చౌటుపల్ మండలానికి చెందిన కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థులు తమ ఉత్తమ ప్రతిభ కనబరిచి పలు పథకాలు కైవసం చేసుకున్నారు.

అండర్ కటాస్ 12వ విభాగంలో ఎల్.ధాన్యశ్రీ జి.నవీన్లు గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది .15 మంది విద్యార్థులు వెండి,కాంస్య పథకాలను సాధించారు.

ఈ సందర్భంగా కృష్ణవేణి హై స్కూల్ కరస్పాండెంట్ గుత్తా కవిత గోపాల్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ విద్యార్థులకు చదువుతో పాటు కరాటే, కుంగ్ ఫు నేర్చుకోవడం వలన శరీర దృఢత్వం, గుండె ధైర్యం మంచి ఆరోగ్యం ఉత్సాహం, మేధస్సు ఎంతో వస్తుందని తమకు తాము రక్షించుకోవడానికి ఆత్మ రక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.రమేష్ గౌడ్,ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు, కోచ్ వి.అనిల్, పిఈటి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. National Award : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణ నుంచి ఎంపికైన మారం పవిత్ర.. ఎవరో తెలుసా..!

  2. Sports : అథ్లెటిక్స్ లో అదుర్స్ అన్నా చెల్లెళ్లు.. రాష్ట్ర స్థాయికి ఎంపిక..!

  3. School Building : నిధులు లేవు.. గదులు లేవు.. చదువులు సాగేదెలా..!

  4. Gold Price : బాబోయ్.. గోల్డ్ ధర ఒక్కరోజే రూ.10,900.. ఈరోజు ధర ఎంతంటే..!

మరిన్ని వార్తలు