Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
ఉధృతంగా లక్ష్మీదేవిగూడెం వాగు.. మిర్యాలగూడ – సూర్యాపేట రోడ్డు మూసివేత..!
ఉధృతంగా లక్ష్మీదేవిగూడెం వాగు.. మిర్యాలగూడ – సూర్యాపేట రోడ్డు మూసివేత..!
వేములపల్లి, మన సాక్షి :
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వరద ఉధృతి పెరగడంతో పోలీసు వారు రోడ్డు మూసి వేశారు. మిర్యాలగూడ వయా భీమారం సూర్యాపేట వెళ్లే రోడ్డును మూసివేశారు. సూర్యాపేటకు ప్రయాణించే ప్రయాణికులకు పాములపహాడ్ మీదుగా దారి మళ్ళించారు. మత్స్యకారులు చేపల వేట జోరుగా కొనసాగిస్తున్నారు.
LATEST UPDATE :
వాగులో కొట్టుకుపోయిన కారు.. కనిపించకుండా పోయిన తండ్రి, కూతురు..!
Miryalaguda: మిర్యాలగూడలో కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం, విద్యుత్ లేక కమ్ముకున్న చీకట్లు..!
BREAKING : విజయవాడ హైవే బ్లాక్.. మిర్యాలగూడ మీదుగా ట్రాఫిక్ మళ్లింపు..!









