TOP STORIESBreaking Newsజాతీయంహైదరాబాద్

UPI : ఫిబ్రవరి 1 నుంచి ఆ యూపీఐ లావాదేవీల నిలిపివేత.. ఫోన్ పే, జి పే వినియోగదారులు తెలుసుకోవల్సిందే..!

UPI : ఫిబ్రవరి 1 నుంచి ఆ యూపీఐ లావాదేవీల నిలిపివేత.. ఫోన్ పే, జి పే వినియోగదారులు తెలుసుకోవల్సిందే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

డిజిటల్ పేమెంట్స్ ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు ఎక్కువైతున్నాయి. భారతదేశంలో కూడా ప్రతి ఒక్కరు యూపీఐ పేమెంట్స్ ని వాడుతున్నారు. కూరగాయలు కొనడం నుంచి భారీ ఉపకరణాలు కొనుగోలు చేసే వరకు యూపీఐ ఆధారిత యాప్ ల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. అయితే యూపీఐ లావాదేవీలను కొన్నింటిని కేంద్ర సంస్థ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నిలిపివేయనున్నది.

యూపీఐ లావాదేవీలకు కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. యూపీఐ చెల్లింపుల భద్రతను పెంచేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అక్రమ లావాదేవీలను నివారించడం, సాంకేతిక ప్రమాణాలను మెరుగుపరచడమే దీని ఉద్దేశం.

కొత్త మార్గదర్శకాలను 2025 జనవరి 9వ తేదీన NPCI సర్కులర్ జారీ చేసింది. యూపీఐ ID సాధారణంగా ఆల్ఫా న్యూమరిక్ అంటే సంఖ్యలు లేదా అక్షరాలు మాత్రమే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రత్యేక అక్షరాలతో ఐడి లు కూడా ఉంటాయి. అయితే ఇటీవల కేంద్రం జారీ చేసిన సర్కులర్ ప్రకారం ఐడీకి సంబంధించి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రత్యేక అక్షరాలతో ఉన్న ఐడీల లావాదేవీలను నిలిపివేయనున్నది.

యూపీఐ వ్యవస్థలో పాల్గొనే వారంతా దీనిని గుర్తించుకోవాలని హెచ్చరించింది. ఆల్ఫా న్యూమరికల్ ఐడీలతో లావాదేవీలు మాత్రమే అనుమతించబడతాయని ప్రత్యేక అక్షరాల ఐడీలను తిరస్కరించనున్నట్లు పేర్కొన్నది.

ప్రత్యేక అక్షరాలు ఉన్న ఐడి అంటే..?

  • యూపీఐ లావాదేవీల సాంకేతిక ప్రమాణాలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

  • యూపీఐ లావాదేవీల ఐడి కేవలం అక్షరాలు లేదా సంఖ్యలు మాత్రమే కలిగి ఉండాలి.

  • ప్రత్యేక అక్షరాలు అంటే @, #, %, &, *, !, $, ¥ ఐడి గా ఈ అక్షరాలు ఉన్నవారికి లావాదేవీలను నిరాకరించబడతాయి.

వీటిని స్వల్ప వ్యాపారులు, మొబైల్ వాలెట్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగదారులు ఉపయోగిస్తారు. వారికి ఇకపై లావాదేవీలు చెల్లుబాటు కావు. అలాంటి వారంతా యూపీఐ లావాదేవీలను తనిఖీ చేసి కొత్త మార్గదర్శకాల ప్రకారం మార్పులు చేసుకోవాల్సి ఉంది. లావాదేవీలు విఫలమైతే వెంటనే బ్యాంకు కస్టమర్ సపోర్టును సంప్రదించాల్సి ఉంది.

Similar News :

  1. Phone Pe : బిగ్ అలర్ట్.. నకిలీ ఫోన్ పే యాప్స్.. తెలుసుకోకుంటే ఎకౌంట్ ఖాళీ..!

  2. Phone Pe Share Market | ఫోన్ పే షేర్ మార్కెట్.. వినియోగదారులకు గుడ్ న్యూస్..!

  3. UPI : ఫోన్ పే, గూగుల్ పే లకు క్రెడిట్ కార్డు లింక్ చేసి వాడుకోవచ్చు.. ఎలా అంటే..!

  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో వెంటనే ఇది ఆఫ్ చేయండి.. లేదంటే మీ ఎకౌంటు ఖాళీ..!

  5. Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు జాగ్రత్త.. ఆ ఫీచర్ ఆఫ్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ.. అందరు తెలుసుకోవాల్సిందే..!

మరిన్ని వార్తలు