District collector : 82,593 మందికి రైతు కుటుంబాలకు రుణమాఫీ.. జిల్లా కలెక్టర్..!
District collector : 82,593 మందికి రైతు కుటుంబాలకు రుణమాఫీ.. జిల్లా కలెక్టర్..!
సూర్యాపేట, మన సాక్షి :
ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ పథకం అమలు సూర్యాపేట జిల్లాలో రెండు విడతలు కలిపి 82,593 రైతు కుటుంబాలకు రైతు రుణమాఫీ నిధులు మంజూరయ్యాయని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు .
మొదటి విడతగా లక్ష రూపాయల లోపు 56,217 మంది రైతు కుటుంబాలకు 282.78 కోట్ల రూపాయలు మంజూరిగాక, సెకండ్ ఫేసులో లక్ష నుండి 1,50,000 వరకు రుణం తీసుకున్న 26,376 మంది రైతు కుటుంబాలకు 250 కోట్లు 30వ తారీఖున రైతులకు వారి ఖాతాలో జమ కానున్నాయని రెండు దఫాలుగా జిల్లాలో రైతులకు రుణమాఫీ కింద 532.78 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
రెండో విడత రుణమాఫీ పథకం అమలు 30న ఉదయం 11 గంటలకు సూర్యాపేట లోని కలెక్టరేట్ కార్యాలయ సమావేశం మందిరంలో జరుగుతుంది కావున రైతులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులందరూ సకాలంలో హాజరు కావాల్సిందిగా కలెక్టర్ ఒక ప్రకటనలో కోరారు.
ఇవి కూడా చదవండి :
District collector : కృష్ణానది పరివాహక ప్రాంతంలో అలర్ట్.. జిల్లా కలెక్టర్ హెచ్చరిక..!
Cm Revanth Reddy : విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా అమలు..!
Srisailam : శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తిన అధికారులు..!
WhatsApp : వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. ఫోన్ నెంబర్ లేకుండానే క్రియేట్ చేయొచ్చు..!









