సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో మంటలకంటే పొగ ఎక్కువ . కారణం అదేనా ?

సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో మంటలకంటే పొగ ఎక్కువ . కారణం అదేనా ?

సికింద్రాబాద్, మనసాక్షి :

సికింద్రాబాద్ లోని రామ్ రామ్ గోపాల్ పేటలో స్పోర్ట్స్ షాప్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మంటలకంటే పొగలు ఎక్కువయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పొగలు దట్టంగా వ్యాపించాయి. స్పోర్ట్స్ షాపులో ఉన్న సామాగ్రికి అంత దట్టమైన పగలు రావడానికి కారణం ఏమయింటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్పోర్ట్స్ షాప్ లో ఇంకా ఏమైనా ఉండొచ్చా అని అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. స్పోర్ట్స్ షాప్ లో రెగ్జిన్ సంబంధించిన క్లాత్ గోదాంలో నిల్వ ఉంచినట్లు తెలుస్తుంది. రెగ్జిన్ క్లాత్ వల్లనే దట్టమైన పొగలు వస్తున్నాయా..? లేక ఇంకా ఏమైనా నిలువలు ఉన్నాయా..? అనే విషయంపై అధికారులు ఆరాధిస్తున్నారు. మంటలు, పొగ అదుపులోకి వచ్చాక పూర్తిస్థాయిలో కమిటీ వేసి విచారణ జరిపిన తర్వాత అసలు విషయం తెలిసే అవకాశం ఉంది.