Marriage : పెళ్లి లో వధూవరులు ప్లకార్డు తో నిరసన
Marriage : పెళ్లి లో వధూవరులు ప్లకార్డు తో నిరసన
మనసాక్షి , వెబ్ డెస్క్ :
పెళ్లి లో వధూవరులు ప్లకార్డు తో నిరసన తెలియజేశారు . ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా.. నిజం… వాళ్లు ఎందుకు నిరసన తెలిపారో తెలుసుకుందాం.. వివరాల ప్రకారం….
పెండ్లీలో తమని రెగ్యులర్ చేయాలని ఫ్లకార్టులతో నిరసన తెలిపారు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు. గత వారం రోజులుగా నిరసనలు తెలుపుతున్న కార్యదర్శులు తమ వివాహా వేడుకలో కూడా వినూత్నంగా ఫ్లకార్డు లతో తమని రెగ్యులర్ చేయాలని నిరసనతో వేడుకున్నారు. శ్రీకాంత్, మౌనికలు ఇద్దరు కూడా జూనియర్ పంచాయతీ సెక్రటరీగా ఉద్యోగాలు సాధించారు.
శ్రీకాంత్ రాజన్న సిరిసిల్ల జిల్లా రామన్నపేట లో జూనియర్ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుండగా , మమత మానకొండూర్ మండలం వెగురుపల్లిలో విధులు నిర్వహిస్తున్నారు.
గత వారం రోజులుగా తమ ప్రోబేషనరీ పిరియడ్ అయిపోయిందని తమని రెగ్యులర్ చెయాలని ఉద్యమ బాట పట్టిన వీరిద్దరూ నిన్న కేశవపట్నం లో వివాహం జరుగగా వివాహా వేడుకలలో పెండ్లి మండపంలోనే తమని రెగ్యులర్ చేయాలని ప్లకార్డు పట్టుకొని నిరసన తెలిపారు.










