వివాహిత మహిళలే వారి లక్ష్యం.. అత్యాచార నిందితులు మామూలోళ్లు కాదు..!
వివాహిత మహిళలే వారి లక్ష్యం.. అత్యాచార నిందితులు మామూలోళ్లు కాదు..!
ఊర్కొండ, మన సాక్షి
శనివారం ఊరుకొండ పేట శివారులో వివాహితపై ఏడు మంది నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. వీరికి కఠినంగా శిక్షిస్తామని ఐజి సత్యనారాయణ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా ఉరుకొండ మండలం ఉరుకొండ పేట గ్రామాన్ని సందర్శించారు,
ఐజి వెంట జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్, డిఎస్పి వెంకటేశ్వర్లు, సీఐ నాగార్జున, కల్వకుర్తి ఎస్ఐ, మాధవరెడ్డి, ఊరుకొండ కృష్ణదేవ, ఉన్నారు ఐజి మీడియాతో మాట్లాడుతూ ఊరుకొండ పేట ఆంజనేయస్వామి దేవాలయంలో నిత్యం పూజలు, భజనలతో పాటు, శనివారం రాత్రంతా జాగారణ సాంప్రదాయక బద్దంగా, భక్తి భవనతో కలిగేదే ఈ దేవాలయ ప్రాముఖ్యత అని ఐజి సత్యనారాయణ తెలిపారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా అధిక భక్తులు ఈ దేవాలయానికి వస్తారని దీనిని అదునుగా భావించిన నేరస్థులు వచ్చిన వారి కదిలిక గమనిస్తూ వచ్చిన భక్తులు గుడి ఆవరణలో ఉండకుండా గుడి నుంచి బయట ప్రాంతం వెళ్లిన వారిని గమనిస్తూ వారిపై దాడులకు పాల్పడుతున్నట్లు పోలీస్ విచారణలో తెలిసిందని ఐజి సత్యనారాయణ అన్నారు.
అత్యాచారానికి పాల్పడిన నేరస్తులు లా, ఫోక్స్ చట్టాలపై అవగాహన ఉందన్నారు, మైనర్ విషయాలలో జాగ్రత్త తీసుకొని వారి ని మైనర్లను వారి దగ్గర డబ్బులు నగలు వస్తువులు తీసుకుని వదిలేసేవారని ఐజి సత్యనారాయణ తెలిపారు. నేరస్తుల వీళ్ల లక్ష్యం వివాహిత మహిళలు అని సమాచారం తెలిసింది, ఎస్పీ డిఎస్పి, సీఐ ఎస్ఐ పరిరక్షణలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఐజి సత్యనారాయణ తెలిపారు.
MOST READ :









