తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవైద్యం

District collector : అనుమతి లేకుండా, సెలవు పెట్టకుండా మెడికల్ ఆఫీసర్ విధులకు గైర్హాజర్.. జిల్లా కలెక్టర్ షోకాజ్..!

District collector : అనుమతి లేకుండా, సెలవు పెట్టకుండా మెడికల్ ఆఫీసర్ విధులకు గైర్హాజర్.. జిల్లా కలెక్టర్ షోకాజ్..!

నల్గొండ : ముందస్తు అనుమతి లేకుండా సెలవు పెట్టకుండా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి గైర్హాజరు కావడంతో నల్గొండ జిల్లా కలెక్టర్ ఆమెపై చర్యలు తీసుకున్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం అక్కినపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంలో వైద్యాధికారి డాక్టర్ వరూధిని అనుమతి లేకుండా, సెలవు పెట్టకుండా విధులకు గైరాజరయ్యారు. దాంతో ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.

ముందస్తు అనుమతి లేకుండా ఎవరు విధులకు గైర్ హాజరు కావద్దని జిల్లా యంత్రాంగం పదేపదే అధికారులు, సిబ్బందికి తెలియజేస్తున్నప్పటికీ డాక్టర్ వరూధిని ఉన్నతాధికారుల అనుమతి లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా,ఎలాంటి సెలవు పెట్టకుండా విదులకు గైర్హాజరు కావడం ఆమెకు విధుల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నదని, అందువల్ల ఆమెపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్ డాక్టర్ వరూధినికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.

పి హెచ్ సి సిబ్బందితో కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, తదితరులకు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మందుల స్టాక్ రిజిస్టర్ను తనిఖీ సందర్బంగా ఎలాంటి మందులు ఇస్తున్నారని? చికిత్స ఎలా చేస్తున్నారని? స్టాఫ్ నర్స్, తదితరుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.

ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న చికిత్స, వారి పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలు, అలాగే చిన్న పిల్లలకు ఇచ్చే టీకాలు , తదితర వివరాలను అడిగారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ద్వారా మంచి సేవలు అందించాలని, అందరిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. సమస్యాత్మక కేసులు వచ్చినట్లయితే నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రికి పంపించాలని సూచించారు.

MOST READ :

  1. Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Ration Cards : మార్చి 1న వారికే స్మార్ట్ రేషన్ కార్డులు.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Rythu Bharosa : ఏదీ రైతు భరోసా.. ఆర్థిక శాఖ పక్కన పెట్టిందా.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Indiramma Indlu : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారా.. అయితే మంజూరు అయిందో, లేదో.. ఇలా తెలుసుకోండి..!

మరిన్ని వార్తలు