Breaking Newsతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : రేపు మిర్యాలగూడలో మంత్రుల పర్యటన.. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు..!

Miryalaguda : రేపు మిర్యాలగూడలో మంత్రుల పర్యటన.. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈనెల 17న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి మిర్యాలగూడ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

ఆదివారం మిర్యాలగూడలో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తో కలిసి మంత్రుల ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మంత్రుల పర్యటన వివరాలను వెల్లడించారు.

సోమవారం ఉదయం మంత్రులు ఉదయం 9:50 నుండి మధ్యాహ్నం 12:15 వరకు ఈ కింది కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపారు. 74 కోట్ల రూపాయల ఎం డి ఆర్ నిధులతో శెట్టిపాలెం నుండి అవంతిపురం వరకు చేపట్టిన రోడ్డును మంత్రులు ప్రారంభించనున్నారు . 15 కోట్ల రూపాయల టి ఎఫ్ యు ఐ డి సి నిధులతో చేపట్టిన రోడ్డును ప్రారంభించనున్నారు.

16 కోట్ల రూపాయల టి ఎఫ్ యు ఐ డి సి
నిధులతో చేపట్టిన సిసి రోడ్డు , మురికి కాలువలను ప్రారంభించనున్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో41 కోట్ల రూపాయల బీటీ, సీసీ రోడ్డు పనులు,15 కోట్ల రూపాయల వ్యయంతో మిర్యాలగూడ నుండి తడకమళ్ళ వరకు ఉన్న డబుల్ రోడ్డు ను 6 లైన్లుగా మార్చే పనులలో, మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఫ్లైఓవర్ ఏరియా, మున్సిపాలిటీ ఏరియా, మున్సిపాలిటీ ఆఫీసు ఏరియా సుందరీకరణ పనులలో పాల్గొంటారు.

అనంతరం నంది పాడు బైపాస్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనులను తనిఖీ చేస్తారు. 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కేఎన్ఎమ్ డిగ్రీ కళాశాల భవనాన్ని ప్రారంభిస్తారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం ప్రారంభిస్తారు. అనంతరం అయ్యప్ప దేవాలయంలో స్వాములతో కలిసి అన్నదానం కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
పై కార్యక్రమాల అనంతరం మంత్రులు మధ్యాహ్నం 12:30 గంటలకు మిర్యాలగూడ పట్టణం నుండి బయలుదేరి హైదరాబాద్ తిరిగి వెళ్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు.

MOST READ :

  1. BIG BREAKING : జమ్ము కాశ్మీర్ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి, 30 మంది గాయాలు..!

  2. Miryalaguda : అభ్యాస్ ప్రైమరీ స్కూల్ లో ఆకట్టుకున్న జాతీయ నాయకుల వేషధారణలు..!

  3. TG News : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.50,918 సబ్సిడీ.. మీరు పొందండి..! 

  4. Nalgonda : వెంకట్ రెడ్డి అన్న.. నాతో ఏం పంచాయితీ ఉంది..? మా పిల్లల్ని ఎందుకు అరెస్ట్ చేయించావు..! 

మరిన్ని వార్తలు