Miryalaguda : మిర్యాలగూడలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 10వ తరగతి పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

Miryalaguda : మిర్యాలగూడలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 10వ తరగతి పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష సమయానికి అరగంట ముందే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతి ఇచ్చారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.
పది పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత:
వేములపల్లి : పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు వేములపల్లి ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం మండలంలోని టిఎస్ మోడల్ స్కూల్,రావులపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు.













