Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
నల్గొండBreaking Newsజిల్లా వార్తలురాజకీయం

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ చైర్ పర్సన్ కు ఘన సన్మానం..!

మిర్యాలగూడ నూతన మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరి సుధ బాలకృష్ణ ను పట్టణ పద్మశాలి సంఘం తరుపున ఘనంగా సన్మానం క నిర్వహించడం జరిగింది.

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ చైర్ పర్సన్ కు ఘన సన్మానం..!

మిర్యాలగూడ, మన సాక్షి:

మిర్యాలగూడ నూతన మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరి సుధ బాలకృష్ణ ను పట్టణ పద్మశాలి సంఘం తరుపున ఘనంగా సన్మానం క నిర్వహించడం జరిగింది. బుధ‌వారం పద్మశాలి సంఘం స్టీరింగ్ కమిటీ, పట్టణ కమిటీ గజమాలతో చైర్ పర్సన్ దంపతులను సత్కరిచారు. వారితో పాటు 14 వ వార్డు కౌన్సిలర్ వడ్డేపల్లి శ్రీనివాస్ ని ఘనంగా సన్మానించడం జరిగింది. పట్టణ చరిత్రలో పద్మశాలి ఆడపడుచు చైర్మన్ గా ఎన్నిక కావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

పద్మశాలి కులస్తురాలుకు చైర్మన్ గా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కి పద్మశాలీలందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ సుధ బాలకృష్ణ మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణ అభివృద్ధికి శాయ శక్తుల కృషి చేస్తానని, స్మార్ట్ సిటీ గా తీర్చిదిద్ది, పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చుతానని తెలిపారు.

కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు జెల్లా రాంబాబు, బావండ్ల పాండు, డాక్టర్ గుండు అంజయ్య, డాక్టర్ మిర్యాల కృష్ణయ్య, డాక్టర్ మనోహర్, అక్షిత, క్యామా వెంకటేశం, యర్రమాద దుర్గమ్మ, రాపోలు వెంకటేశ్వర్లు, బొల్లా లక్ష్మీనారాయణ, రావిరాల నాగేందర్, కోడి జనార్దన్, మాజీ కౌన్సిలర్ చిలుకూరి రమాదేవిశ్యామ్, జెల్లా శ్రీనివాస్, జిల్లా ప్రభాకర్, మురళి, శ్రీను పట్టణ కమిటీ సభ్యులు స్టీరింగ్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

MOST READ 

  1. రైతులకు శుభవార్త.. సబ్సిడీపై వ్యవసాయ యంత్రాల పంపిణీ..!

  2. Madanapalle : ఏడేళ్ల చిన్నారి దారుణ హత్య.. ఆగ్రహంతో ఊగిపోతున్న మదనపల్లె..!

  3. Nalgonda : సూపర్ స్మార్ట్ సిటీగా నల్లగొండ..!

  4. TG News : తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని మున్సిపాలిటీలు వచ్చాయంటే..!

మరిన్ని వార్తలు