Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణరాజకీయం

TG News : తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని మున్సిపాలిటీలు వచ్చాయంటే..!

తెలంగాణలో మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ల చైర్మన్, మేయర్ పదవులకు కొలువులు దీరారు.

TG News : తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని మున్సిపాలిటీలు వచ్చాయంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ల చైర్మన్, మేయర్ పదవులకు కొలువులు దీరారు. ఆయా మున్సిపాలిటీలకు పాలక వర్గాలు ఏర్పడ్డాయి. ఫిబ్రవరి 11వ తేదీన మున్సిపల్ ఎన్నికలు నిర్వహించగా 13వ తేదీన ఫలితాలు వెలుపడ్డాయి. కాగా 16వ తేదీన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అదే విధంగా మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లు కూడా ప్రమాణస్వీకారం చేశారు.

తెలంగాణలో మెజారిటీ మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7 మున్సిపల్ కార్పొరేషన్ ఉండగా కాంగ్రెస్ పార్టీ 5 కార్పొరేషన్లపై జెండా ఎగరవేసింది. సిపిఐ కాంగ్రెస్‌తో జతకట్టి ఒకటి, బిజెపి ఒకటి కైవసం చేసుకున్నాయి.

మున్సిపాలిటీలలో ఎవరికి ఎన్ని :

రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు ఉండగా వాటిలో కాంగ్రెస్ పార్టీ 85 మున్సిపాలిటీలలో జెండా ఎగరవేసింది. బీఆర్ఎస్ 17, బిజెపి ఒక మున్సిపాలిటీ పై జెండా ఎగరవేశాయి. ఇదిలా ఉండగా ఇప్పటివరకు 105 మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు పూర్తికాగా మరో పదకొండు చోట్ల వివిధ కారణాలతో వాయిదా పడ్డాయి.

MOST READ 

  1. Breaking News : టాప్ 5.. మనసాక్షి ఫ్లాష్ న్యూస్..!

  2. TG News : రైతులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త.. వారికి ఖాతాలలో నిధులు జమ..!

  3. Karimnagar : కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఖరారు.. ఉత్కంఠతకు తెర..!

  4. Penpahad : నాగులపహాడ్ త్రికుటేశ్వరాలయంలో పోటెత్తిన భక్తులు..!

మరిన్ని వార్తలు