Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

TG News : రైతులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త.. వారికి ఖాతాలలో నిధులు జమ..!

రైతులకు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతుల ఖాతాలలో డబ్బులను జమ చేసింది. ఖరీఫ్ సీజన్ లో ప్రభుత్వం కొనుగోలు చేసిన సన్నధాన్యం కు చెల్లించాల్సిన బోనస్ డబ్బులను విడుదల చేసింది.

TG News : రైతులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త.. వారికి ఖాతాలలో నిధులు జమ..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

రైతులకు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతుల ఖాతాలలో డబ్బులను జమ చేసింది. ఖరీఫ్ సీజన్ లో ప్రభుత్వం కొనుగోలు చేసిన సన్నధాన్యం కు చెల్లించాల్సిన బోనస్ డబ్బులను విడుదల చేసింది. మొత్తంగా 514.36 కోట్ల రూపాయలను బోనస్ బకాయిలన్నింటిని విడుదల చేసింది. ఈ డబ్బులు రైతుల ఖాతాలలో క్వింటాకు 500 రూపాయల బోనస్ చొప్పున జమ కానున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 2.17 లక్షల మంది రైతుల ఖాతాలలో ఈ డబ్బులు జమకానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు 1939.58 కోట్ల రూపాయలను బోనస్ రూపంలో చెల్లించింది. రాష్ట్రంలో సన్న ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు గాను రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం క్వింటాకు 500 రూపాయల బోనస్ అందిస్తున్న విషయం తెలిసిందే.

కాగా నిధుల లేని కారణంగా కాస్త ఆలస్యంగా బకాయి బోనస్ లను పూర్తిగా విడుదల చేసింది. రైతులు వారి వారికి రావలసిన బోనస్ బకాయలను బ్యాంకు ఖాతాలలో చెక్ చేసుకోవాలని, ఏవైనా సమస్యలు ఉంటే కొనుగోలు కేంద్రాలు, సీల్ సప్లై అధికారులను సంప్రదించాలని సూచించారు.

MOST READ 

  1. Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక.. వీడిన సస్పెన్స్..!

  2. District collector : జిల్లా కలెక్టర్ కీలక వ్యాఖ్య.. సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం..!

  3. Narayanpet : పేట మున్సిపల్ చైర్ పర్సన్ బిజెపి కైవసం..!

  4. Miryalaguda : మిర్యాలగూడలోని సెయింట్ జాన్స్ హై స్కూల్లో విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు..!

మరిన్ని వార్తలు