Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsక్రైంపెద్దపల్లి జిల్లా

మహిళ అనుమానస్పద మృతి.. సంఘటన స్థలం పరిశీలించిన పోలీస్ కమిషనర్..!

స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రబాబు కాలనీలో నివాసముంటున్న ఎల్లపూల రమణమ్మ (65) తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

మహిళ అనుమానస్పద మృతి.. సంఘటన స్థలం పరిశీలించిన పోలీస్ కమిషనర్..!

గోదావరిఖని, మన సాక్షి :

స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రబాబు కాలనీలో నివాసముంటున్న ఎల్లపూల రమణమ్మ (65) తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

స్థానికుల సమాచారంతో మృతురాలి కుమారుడు ఇంటికి వచ్చి చూడగా రమణమ్మ మంచంపై మృతి చెంది ఉండగా, ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, చెవికమ్మలు, సుమారు ఐదు తులాల బంగారు గాజులు కనిపించకపోవడంతో అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సంఘటన స్థలం, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి మృతురాలి కుమారుడితో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఎవరిపైనైనా అనుమానం ఉన్నా, లేదా ఘటనకు సంబంధించిన ఏదైనా కీలక సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, నిందితులను త్వరితగతిన గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు