స్కూల్ బస్సును ఢీకొన్న లారీ..!
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన నాగార్జున ప్రైవేట్ స్కూల్ బస్సు నల్లెల్ల స్టేజి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది.

స్కూల్ బస్సును ఢీకొన్న లారీ..!
కురవి, మన సాక్షి :
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన నాగార్జున ప్రైవేట్ స్కూల్ బస్సు నల్లెల్ల స్టేజి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. స్థానికుల కథనం ప్రకారం, బస్సు డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల ఎదురుగా వచ్చిన లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడగా, వారిని వెంటనే మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులు లింగ్యతండా గ్రామానికి చెందిన వారిగా ప్రాథమిక సమాచారం వెల్లడైంది.
ప్రమాదం అనంతరం స్థానికులు, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల అసలు కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి గాయపడిన విద్యార్థుల సంఖ్య, వారి ఆరోగ్య పరిస్థితి, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది









