Miryalaguda : రైతులకు అందుబాటులో యూరియా..!
మిర్యాలగూడ మండలంలోని 5 ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల (పిఎసిఎస్)లో యూరియా అందుబాటులో ఉందని,రైతులు బుక్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి మేకల ఋష్యేంద్రమణి తెలిపారు.

Miryalaguda : రైతులకు అందుబాటులో యూరియా..!
మిర్యాలగూడ, మన సాక్షి:
మిర్యాలగూడ మండలంలోని 5 ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల (పిఎసిఎస్)లో యూరియా అందుబాటులో ఉందని,రైతులు బుక్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి మేకల ఋష్యేంద్రమణి తెలిపారు. బుధవారం ఆలగడప పిఎసిఎస్ లో యూరియా నిల్వలు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రైతులు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా రైతులు యూరియా బుక్ చేసుకుని తీసుకోవాలన్నారు.
ఇప్పటి వరకు మండలంలో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా 27,039 యూరియా బస్తాలు బుక్ అయినవన్నారు. యూరియా బుకింగ్ యాప్ లో మార్పులు జరిగాయని రెండేకరాల పంటకు సరి పోయే యూరియా ఒకే సారి చేసుకోవచ్చని, 2 నుండి 5 ఎకరాలున్న రైతులు రెండు దఫాలు, 5 ఎకరాలకు పైగా ఉన్న రైతులు ముందు 40శాతం, రెండోసారి 30 శాతం, మూడో సారి 30శాతం బుక్ చేసుకోవాలన్నారు.
మండలంలోని ఆలగడప, అన్నారం, తడకమల్ల, తుంగపాడు,మిర్యాలగూడ ప్రాధమిక వ్యవసాయ సహకర సంఘాలలో యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని బుక్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ సీఈఓ నాగయ్య, సైదులు, ప్రవీణ్, వెంకట్రాములు, సుధాకర్ లున్నారు.
MOST READ :









