Miryalaguda : మిర్యాలగూడలో గంజాయి ప్యాకెట్ల తయారీ స్థావరంపై పోలీసుల దాడి..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గంజాయి ప్యాకెట్ల తయారీ స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పట్టణ శివారు అగ్రిగోల్డ్ వెంచర్లో గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయించేందుకు సిద్ధమవుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

Miryalaguda : మిర్యాలగూడలో గంజాయి ప్యాకెట్ల తయారీ స్థావరంపై పోలీసుల దాడి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గంజాయి ప్యాకెట్ల తయారీ స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పట్టణ శివారు అగ్రిగోల్డ్ వెంచర్లో గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయించేందుకు సిద్ధమవుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 4 కిలోల గంజాయి, సెల్ఫోన్లు, గంజాయి ప్యాకింగ్ కు ఉపయోగించే 20 ఫ్లిప్ కవర్లను స్వాధీనం చేసుకున్నట్లు మిర్యాలగూడ వన్ టౌన్ సీఐ నాగభూషణరావు తెలిపారు.
మంగళవారం విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. విశ్వసనీయ సమాచారం మేరకు అగ్రిగోల్డ్ వెంచర్ లో దాడి నిర్వహించి గంజాయిని 20 గ్రాముల చొప్పున చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట ప్రాంతాల్లో విక్రయించేం దుకు సిద్ధమవుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నమన్నారు.
ప్రధాన నిందితుడు కన్నెగంటి ఈశ్వర గోపీనాథ్ అలియాస్ నాని గత మూడేళ్లుగా ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్నాడని, గతంలో సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నమోదైన రెండు గంజాయి కేసుల్లో నిందితుడిగా ఉన్నప్పటికీ అక్రమ రవాణా ను కొనసాగించినట్లు విచారణలో తేలిందన్నారు. అతడు మిర్యాలగూడకు చెందిన యడవెల్లి సాయి మహేష్ అలియాస్ గణేష్ (గని), గరిడేపల్లికి చెందిన మాచర్ల రాహుల్, కందుల శ్రీరామ్, కోదాడకు చెందిన కుంచం ధనుష్ సహకారంతో గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నా మని తెలిపారు.
నిందితుల వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి మత్తుకు బానిసలైన నేరేడుచర్లకు చెందిన బండి లాలయ్య, కోదాడకు చెందిన కొత్త రోహిత్, ఉత్తరప్రదేశ్ కు చెందిన కమలేష్ ను బాధితులుగా గుర్తించి డీ-అడిక్షన్ కేంద్రానికి తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలి పారు. విలేకరుల సమావేశంలో ఎస్సై వెంకటేశ్వర్లు, హెడ్ కాని స్టేబుల్ రాజారామ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
MOST READ :









