Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జాతీయంBreaking News

శోభనం గదిలో వరుడికి అదిరిపోయే షాక్ ఇచ్చిన వధువు.. అర్ధరాత్రి వేళ ఊహించని ట్విస్ట్..!

పెళ్లి అయిన తర్వాత మొదటి రాత్రి (శోభనం రోజే) పెళ్లికూతురు వరుడికి అదిరిపోయే షాక్ ఇచ్చింది. అర్ధరాత్రి వేళలో ఆ ఊహించని పెద్ద ట్విస్ట్ ఏంటంటే..

శోభనం గదిలో వరుడికి అదిరిపోయే షాక్ ఇచ్చిన వధువు.. అర్ధరాత్రి వేళ ఊహించని ట్విస్ట్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

పెళ్లి అయిన తర్వాత మొదటి రాత్రి (శోభనం రోజే) పెళ్లికూతురు వరుడికి అదిరిపోయే షాక్ ఇచ్చింది. అర్ధరాత్రి వేళలో ఆ ఊహించని పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. వధువు తన ప్రేమ వ్యవహారాన్ని మొదటి రోజు రాత్రి భర్తకు ఓపెన్ గా చెప్పేసింది. ఆ తర్వాత వరుడు తీసుకున్న నిర్ణయం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాకు చెందిన ఒక యువకుడికి మీరట్ కు చెందిన ఒక యువతికి 2026 జూన్ 25 బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా వివాహం జరిగింది. పెళ్ళైన తర్వాత శోభనం గదిలో భార్యతో మాట్లాడడానికి వరుడు వెళ్లాడు. కాగా తనకు అప్పటికే వేరొకరితో ప్రేమ వ్యవహారం ఉందని, అతనితోనే కలిసి బతకాలని ఉన్నట్లు వధువు ముక్కుసూటిగా వరుడికి విషయం చెప్పేసింది.

వధువు… ఆత్మహత్య బెదిరింపు :

ఆమె.. తన ప్రియుడితో గనుక చేర్చకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దాంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన వరుడు ఇంట్లో ఎలాంటి అసంతృప్తి సంఘటన జరగకూడదనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకున్నాడు. అర్ధరాత్రి ప్రియుడికి ఫోన్ చేసి పిలిపించాడు. అనంతరం తన భార్యను అతనితో పాటు పంపించేశాడు. ఇది బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా “హమ్ దిల్ దే చుకే సనం’ స్టోరీ లాగా ఈ నిజ జీవిత సంఘటన జరగటం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు