Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలురాజకీయంసూర్యాపేట జిల్లా

Suryapet : చేనేత సహకార ఎన్నికల్లో సాయినేత ఏకగ్రీవ ఎన్నిక..!

సూర్యాపేట చేనేత పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్‌గా సాయినేత ఏకగ్రీవంగా ఎన్నిక కావడం స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది.

Suryapet : చేనేత సహకార ఎన్నికల్లో సాయినేత ఏకగ్రీవ ఎన్నిక..!

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట చేనేత పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్‌గా సాయినేత ఏకగ్రీవంగా ఎన్నిక కావడం స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎలాంటి పోటీ లేకుండా సభ్యులందరి మద్దతుతో ఆయన ఎన్నిక కావడం, చేనేత పారిశ్రామిక సహకార సంఘంలో ఆయనకు ఉన్న ఆమోదాన్ని ప్రతిబింబిస్తోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

సాధారణంగా సహకార సంఘాల ఎన్నికలు వర్గపోరు, రాజకీయ పోటీకి వేదికగా నిలుస్తాయి. అయితే ఈసారి సభ్యుల మధ్య ఏకాభిప్రాయం నెలకొని సాయినేతను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వెనుక సమన్వయ రాజకీయాలు పనిచేశాయనే చర్చ సాగుతోంది.

ఈ ఎన్నికతో సాయినేత స్థానికంగా తన ప్రభావాన్ని మరింత బలోపేతం చేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రానున్న రోజుల్లో సహకార సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, పారదర్శక పాలనపై ఆయన తీసుకునే నిర్ణయాలే ఈ విజయానికి అసలైన అర్థాన్ని నిర్ధారించనున్నాయి. ఏకగ్రీవ ఎన్నికతో వచ్చిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సభ్యుల అంచనాలను నెరవేర్చడం జరుగుతుందని సాయి నేత తెలిపారు.

సాయి నేత ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చురుకైనా పాత్ర పోషిస్తూ ఏ ఐ సి సి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల సమాచారం ఎప్పటికప్పుడు సామాజిక మధ్యమాల్లో పెడుతున్నారు. సాయి నేత ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు