Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : బైండ్ ఓవర్ నిబంధనల ఉల్లంఘన.. రూ.70 వేలు జరిమానా..!

సత్ప్రవర్తన నియమావళి ని (బైండోవర్) అతిక్రమించి, మహిళను వేధించిన నిందితుడికి రూ. 70,000 జరిమానా విధించినట్లు పాలకవీడు ఎస్ఐ కోటేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

Suryapet : బైండ్ ఓవర్ నిబంధనల ఉల్లంఘన.. రూ.70 వేలు జరిమానా..!

(పాలకవీడు) సూర్యాపేట, మనసాక్షి:

సత్ప్రవర్తన నియమావళి ని (బైండోవర్) అతిక్రమించి, మహిళను వేధించిన నిందితుడికి రూ. 70,000 జరిమానా విధించినట్లు పాలకవీడు ఎస్ఐ కోటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. పాలకవీడు మండలం యల్లాపురం గ్రామానికి చెందిన షేక్ హకీం గత కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఒక మహిళను వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గతంలోనే పాలకవీడు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగినది.

అనంతరం నిందితుడి ప్రవర్తనలో మార్పు రావడం కోసం, శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం పాలకవీడు మండల తహశీల్దార్ ఎదుట సత్ప్రవర్తన గ్యారెంటీపై బైండ్ఓవర్ చేయడం జరిగినది. అయినప్పటికీ నిందితుడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. బైండ్ఓవర్ నిబంధనలను బేఖాతరు చేస్తూ సదరు వివాహిత పట్ల మళ్లీ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో పోలీసులు అతనిపై మరోసారి కేసు నమోదు చేసి, రిమాండ్‌ నిమిత్తం జైలుకు తరలించారు.

నిందితుడు బైండ్ ఓవర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఎస్ఐ కోటేష్ సమర్పించిన నివేదిక ఆధారంగా, హకీంకు రూ. 70,000 భారీ జరిమానా విధించారు. ఈ మేరకు నిందితుడి నుండి జరిమానా మొత్తాన్ని వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై, ముఖ్యంగా మహిళల భద్రతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు.

మరిన్ని వార్తలు