Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Narayanpet : ఆ దొంగ టార్గెట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. మామూలోడు కాదు..!

తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని కోస్గి పోలీసులు, నారాయణపేట సీసీఎస్ పోలీసుల సంయుక్త బృందం వేగంగా అరెస్టు చేసి, దొంగిలించిన నగదులో రూ.6,88,500 స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.

Narayanpet : ఆ దొంగ టార్గెట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. మామూలోడు కాదు..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని కోస్గి పోలీసులు, నారాయణపేట సీసీఎస్ పోలీసుల సంయుక్త బృందం వేగంగా అరెస్టు చేసి, దొంగిలించిన నగదులో రూ.6,88,500 స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.

జిల్లా ఎస్పీ పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పత్రిక సమావేశంలో మాట్లాడుతూ గండీడ్ మండలం లింగయ్య పల్లికి చెందిన ఎదుల బాబు ఇళ్లకు తాళాలు వేసిన ఇండ్లనే టార్గెట్ చేసుకొని వరుస దొంగతనాలు చేసినాడు అని తెలిపారు. సోమవారం కోస్గి లో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులను గమనించిన నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా, అప్రమత్తమైన పోలీసులు వెంటాడి అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. విచారణలో నేరాన్ని అంగీకరించిన నిందితుడి ఇంటి నుంచి రూ.6,88,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ కేసులో మొత్తం దొంగిలించబడిన నగదు రూ.10,00,000 అని తెలిపారు. నిందితుడు 2022 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మొత్తం 18 ఆస్తి సంబంధిత నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు. కోస్గి, కుల్కచర్ల, మరికల్, మహమ్మదాబాద్, మద్దూర్, నారాయణపేట, వికారాబాద్, డోమా, మహబూబ్‌నగర్ రూరల్, హన్వాడ పోలీస్ స్టేషన్ల పరిధిలో అతనిపై పలు కేసులు నమోదయ్యాయని,
ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, చెడు అలవాట్ల కారణంగా నిందితుడు పగటి సమయంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, ఇనుప పరికరాలతో తాళాలు పగులగొట్టి నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు దొంగిలించేవాడని విచారణలో వెల్లడైనట్లు ఎస్పీ తెలిపారు.

అనంతరం బంగారాన్ని ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకుని, ఆ డబ్బుతో అప్పులు తీర్చడం, కుటుంబ ఖర్చులు నిర్వహించడం, చెడు అలవాట్లకు ఖర్చు చేసేవాడని వివరించారు. ప్రజలు తమ ఇళ్లు, వ్యాపార సంస్థలకు నాణ్యమైన తాళాలు ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపించిన వెంటనే వెంటనే డయల్-100కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కేసును సమర్థవంతంగా ఛేదించి నిందితుడిని అరెస్టు చేసి దొంగిలించిన నగదును స్వాధీనం చేసుకోవడంలో విశేష కృషి చేసిన కోస్గి సీఐ ఎ. సైదులు, కోస్గి ఎస్‌ఐ జి. పురుషోత్తం, సీసీఎస్ ఎస్‌ఐ విజయభాస్కర్, కోస్గి పోలీస్ స్టేషన్ సిబ్బంది, సీసీఎస్ పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో డిఎస్పిలు నల్లపు లింగయ్య, మహేష్ లు ఉన్నారు.

మరిన్ని వార్తలు