Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

Breaking : ఫుడ్ పాయిజన్ తో 20 మంది విద్యార్థులకు అస్వస్థత, బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలింపు..!

బీర్కూర్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే కళాశాలలో ఆదివారం రాత్రి 20 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో పిల్లలకు విరోచనాలు అయి అస్వస్థకు గురయ్యారు..

Breaking : ఫుడ్ పాయిజన్ తో 20 మంది విద్యార్థులకు అస్వస్థత, బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలింపు..!

బీర్కూర్( మనసాక్షి ) :

బీర్కూర్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే కళాశాలలో ఆదివారం రాత్రి 20 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో పిల్లలకు విరోచనాలు అయి అస్వస్థకు గురయ్యారు.. దీంతో
హుటాహుటిన రాత్రి 11 గంటలకు పాఠాశాల సిబ్బంది విద్యార్థులకు అంబులెన్స్ లో బాన్సువాడ ఏరియా ఆసుపత్రి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. విద్యార్థులను ప్రత్యేక వైద్యుల సంరక్షణలో ఉంచారని ఆస్పత్రి సిబ్బంది విలేకరులకు మరియు వల తల్లిదండ్రులకు తెలియజేశారు.

విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ సోమవారం ఉదయం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు.. విద్యార్థులకు విరోచనాలు, ఫుడ్ పాయిజన్ కి గల వివరాలను కళాశాల ప్రిన్సిపాల్ శివ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు.. కళాశాల సిబ్బంది విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించి వారి యోగక్షేమలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు.. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని అన్నారు..

మరిన్ని వార్తలు