Miryalaguda : ఎరువుల దుకాణదారులకు జిల్లా అధికారి హెచ్చరిక.. అక్రమ నిల్వలకు పాల్పడితే కఠిన చర్యలు..!
మిర్యాలగూడ పట్టణంలోని శ్రీసాయి మహేశ్వర ఫర్టిలైజర్, కిసాన్ సీడ్స్ ను శనివారం జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Miryalaguda : ఎరువుల దుకాణదారులకు జిల్లా అధికారి హెచ్చరిక.. అక్రమ నిల్వలకు పాల్పడితే కఠిన చర్యలు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ పట్టణంలోని శ్రీసాయి మహేశ్వర ఫర్టిలైజర్, కిసాన్ సీడ్స్ ను శనివారం జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, విక్రయ విధానం, ధరల పట్టికలు, స్టాక్ రిజిస్టర్లు, లైసెన్సులు, ఇతర రికార్డులను పరిశీలించారు. నాణ్యమైన విత్తనాలు ఎమ్మార్పీ ధరలకు విక్రయించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట చిల్లర ధర ఎమ్మార్పీకే విక్రయించాలని, అధిక ధరలకు విక్రయించడం లేదా అక్రమ నిల్వలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన వరి ఏడు సన్న రకాల సాగును బీపీటీ-5204 (సాంబా మసూరి), ఆర్‌ఎన్‌ఆర్-15048 (తెలంగాణ సోనా), హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, కెఎన్‌ఎం-1638 (కూనారం సన్నాలు), డబ్ల్యూజీఎల్- 44 (సిద్ధి), కెఎన్‌ఎం-7715 రైతుల్లో విస్తృతంగా ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. విత్తనాల విక్రయాలకు సంబంధించిన వివరాలను సీడ్ ఆన్లైన్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేసి, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని డీలర్లను ఆదేశించారు.
రాబోయే కాలంలో ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవించే అవకాశం ఉన్నందున, రైతులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకునేలా అవగాహన కల్పించాలని, వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలని తెలిపారు.ఈ తనిఖీల్లో మండల వ్యవసాయ అధికారి ఋషేంద్ర మణి,వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.









