Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలురాజకీయంసూర్యాపేట జిల్లా

Suryapet : కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా కోతి గోపాల్ రెడ్డి నియామకం..!

సూర్యాపేట కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడిగా కోతి గోపాల్‌ రెడ్డి రెండవ సారి నియమితులయ్యారు.

Suryapet : కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా కోతి గోపాల్ రెడ్డి నియామకం..!

సూర్యాపేట, మన సాక్షి:

సూర్యాపేట కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడిగా కోతి గోపాల్‌ రెడ్డి రెండవ సారి నియమితులయ్యారు. ఈయన 2019లో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులుగా, 2021, 2026లో మండల అధ్యక్షులుగా నియామకమయ్యారు. రెండు సార్లు కాసరబాద గ్రామానికి ఉప సర్పంచ్‌గా, ప్రస్తుతం సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. తన నియామకానికి సహకరించిన జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్‌ రెడ్డి,జిల్లా అధ్యక్షులు గుడిపాటి నరసయ్యలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు