Karimnagar : అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..!
వేములవాడ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న వేములవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ15జెడ్ 0185) కొత్తపల్లి మండల పరిధిలోని బావుపేట పెద్ద మోరి వద్ద ప్రమాదానికి గురైంది.

Karimnagar : అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..!
కరీంనగర్, మనసాక్షి :
వేములవాడ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న వేములవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ15జెడ్ 0185) కొత్తపల్లి మండల పరిధిలోని బావుపేట పెద్ద మోరి వద్ద ప్రమాదానికి గురైంది. ప్రయాణికులతో వేగంగా వెళ్తున్న బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పైకి దూసుకెళ్లింది. డివైడర్ పైకి ఎక్కిన బస్సు, అక్కడ ఉన్న ఒక పెద్ద విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.
ఆ తాకిడికి కరెంట్ స్తంభం పూర్తిగా వంగిపోయి విరిగిపడింది. బస్సు ముందు భాగం కూడా ఈ ప్రమాదంలో దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో పలువురు ప్రయాణికులు ఉన్నారు. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు, ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.









