Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

District Collector : అమ్మ పేరు తో మొక్కలు నాటండి.. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..!

పర్యావరణ పరిరక్షణ, హరితహారం విస్తరణ, విద్యార్థుల్లో ప్రకృతి పట్ల బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఎన్జీసీ మరియు జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న “ఏక్ పెడ్ మా కే నామ్ అమ్మ పేరుతో మొక్కను నాటడం 2026 జాతీయ విద్యార్థి పర్యావరణ పోటీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆవిష్కరించారు.

District Collector : అమ్మ పేరు తో మొక్కలు నాటండి.. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..!

సూర్యాపేట, మనసాక్షి

పర్యావరణ పరిరక్షణ, హరితహారం విస్తరణ, విద్యార్థుల్లో ప్రకృతి పట్ల బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఎన్జీసీ మరియు జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న “ఏక్ పెడ్ మా కే నామ్ అమ్మ పేరుతో మొక్కను నాటడం 2026 జాతీయ విద్యార్థి పర్యావరణ పోటీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఏక్ పెడ్ మా కే నామ్ కార్యక్రమం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు ప్రకృతి పట్ల ప్రేమ, బాధ్యతాభావంపెరుగుతుందని తెలిపారు.

ప్రతి పాఠశాలలో కనీసం 10 పండ్ల మొక్కలు మరియు ఇతర మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ఈ జాతీయ స్థాయి పర్యావరణ పోటీని తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ALSO READ : Narayanpet : ఆ దొంగ టార్గెట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. మామూలోడు కాదు..!

కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, పరిశోధకులు, సాధారణ పౌరులు మొక్కలు నాటడం, సీడ్ బాల్స్ తయారీ, పర్యావరణ అవగాహన కార్యక్రమాలలో పాల్గొని తమ ఫోటోలను అప్‌లోడ్ చేయడం ద్వారా పోటీలో పాల్గొనవచ్చని వివరించారు.ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కల నాటడం చేపట్టి హరిత సూర్యాపేట ” నిర్మాణానికి అందరూ సహకరించాలని అధికారులు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు ఈ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణను విద్యార్థుల దైనందిన జీవితంలో భాగంగా మార్చేందుకు ఈ కార్యక్రమం ఎంతోఉపయోగపడుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి విద్యాసంస్థ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ALSO READ : Miryalaguda : ఆ ఏడు రకాల వరి విత్తనాలనే రైతులకు విక్రయించాలి..!

ఈ కార్యక్రమం గురించి మరింత సమాచారానికి ఎన్జిసి జిల్లా కోఆర్డినేటర్ లామ్ దేవరాజు గారిని సంప్రదించగలరు.ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ బి.హరి సింగ్, డిఆర్ఓ ప్రేమ్ రాజ్, జడ్.పి. సిఇఓ శిరీష, హొసింగ్ పిడి సిద్ధార్థ్, డిపిఓ యాదగిరి,సిపిఓ కిషన్, డిఎఓ శ్రీధర్ రెడ్డి, డిఎఫ్ ఓ దామోదర్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు