Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

Rythu Bharosa : రైతులు ఈ పంటలు సాగు చేస్తే రైతు భరోసాతో పాటు అదనంగా రూ. 8000 సహాయం..!

తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త అందించింది. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నూతన సమగ్ర వ్యవసాయ విధానం - 2026 నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది.

Rythu Bharosa : రైతులు ఈ పంటలు సాగు చేస్తే రైతు భరోసాతో పాటు అదనంగా రూ. 8000 సహాయం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త అందించింది. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నూతన సమగ్ర వ్యవసాయ విధానం – 2026 నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదికలో రైతులు వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించాలని సూచించింది. అందుకోసం ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపే రైతులకు ఎకరానికి ₹4,000 నుంచి 8 వేల రూపాయల వరకు అదనంగా నగదు సహాయం అందించాలని ప్రభుత్వానికి సూచించింది.

ఈ నివేదిక ప్రకారం రాబోయే ఐదు సంవత్సరాలలో 25 లక్షల ఎకరాల వరి సాగును దశలవారీగా తగ్గించి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పత్తి, పెసర, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు సాగు చేసే రైతులకు రైతు భరోసా సహాయంతో పాటు ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు అదనంగా ఇన్సెంటివ్ ఇవ్వాలని సూచించింది. జొన్న సాగుకు 5000 రూపాయలు, మొక్కజొన్న, కంది, మినుము, ఆముదం, సోయాబీన్, శెనగ పంటలకు ఎకరానికి ₹4,000 చొప్పున సహాయం అందించాలని ప్రతిపాదించారు.

జూలై 2వ తేదీన జరగబోయే మంత్రిమండలి సమావేశంలో ఈ నివేదికపై చర్చించనున్నారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగినప్పటికీ ఒకే పంటపై అధికంగా ఆధారపడటం వల్ల నీటి వనరులు, భూమి నాణ్యత పై ఒత్తిడి పెరుగుతుంది. మిగులు ధాన్యం నిల్వలు నిర్వహణ ఖర్చులు సహజ వనరుల సమస్య కూడా తీవ్రమవుతుంది.

ఈ నేపథ్యంలో యూనివర్సిటీ బీసీ వైస్ ఛాన్స్లర్ జానయ్య నేతృత్వంలో బృందం జాతీయ అంతర్జాతీయ అనుభవాలను పరిశీలించి ఈ నివేదికను సిద్ధం చేసింది. అదేవిధంగా ఈ కొత్త విధానం అమలు అయితే రైతుల ఆదాయం పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం ఈ సూచనలను అమలు చేస్తే తెలంగాణ వ్యవసాయ రంగం దిశ మార్చుకుంటుందని రైతు సంఘాలు కూడా భావిస్తున్నాయి.

రైతులకు నష్టాల భయాన్ని తొలగించడానికి ప్రభుత్వమే నిధులు సమకూర్చి ప్రత్యేక పంటల బీమా పథకం అమలు చేయాలని కూడా నివేదికలో పేర్కొన్నారు. అదేవిధంగా పంట మార్పిడి మాత్రమే కాకుండా ఉత్పత్తులకు మంచి మార్కెట్ అవకాశాలు కల్పించాలని కూడా యూనివర్సిటీ నివేదికలో పేర్కొన్నది. పప్పు ధాన్యాల మిల్లులు, నూనె గింజల శుద్ధి కేంద్రాలు, నిల్వ సౌకర్యాలు, ప్యాకేజింగ్, బ్రాండింగ్ వంటి వెలివేషన్ యూనిట్లను కూడా ప్రోత్సహించాలని సూచించింది. మహిళా స్వయం సహాయక సంఘాలు, ప్రైవేట్ సంస్థలను కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని నివేదిక సూచించింది.

MOST READ : 

మరిన్ని వార్తలు