Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Vemulapally : రెచ్చిపోతున్న కేబుల్ వైర్ దొంగలు.. ఆందోళనలో రైతులు..!

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో రైతుల వ్యవసాయ మోటర్ల వైర్లు చోరీకి గురయ్యాయి. స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం..

Vemulapally : రెచ్చిపోతున్న కేబుల్ వైర్ దొంగలు.. ఆందోళనలో రైతులు..!

వ్యవసాయం మోటార్ల కేబుల్ వైర్లు చోరీ..!

వేములపల్లి, మన సాక్షి:

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో రైతుల వ్యవసాయ మోటర్ల వైర్లు చోరీకి గురయ్యాయి. స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సుమారు 10 మంది రైతుల వ్యవసాయ మోటర్ల వైర్లు దొంగలు కత్తిరించకపోయారు. సోమవారం ఉదయం నారుమళ్ళకు నీళ్లు పెట్టెందుకు వెళ్లిన రైతులు గమనించారు. మోటర్‌ నుంచి మెయిన్‌ బోర్డు వరకు ఉండే కేబుల్‌ వైర్లు కత్తిరించి ఉండడాన్ని చూసి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

గత వారం పది రోజుల నుంచి మోటార్ల వైర్లు చోరీలకు గురవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.ఒక్కో మోటర్‌ వద్ద సుమారు 10 నుంచి 20 మీటర్ల వైరు కత్తిరించారు.ఈ వైరు మీటర్‌కు రూ.150 చొప్పున ఖరీదు ఉందన్నారు. ఇప్పుడు ప్రతి మోటర్‌కు ఖర్చు చేసి కేబుల్‌ వైరు కొనాల్సి వస్తుందని,మళ్లీ ఏ రోజు దొంగలు ఎత్తుకెళ్తారో కూడా తెలియదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పోలీసులు నిఘా పెట్టి దొంగలను పట్టుకొని రైతులను కాపాడాలని వారు వేడుకుంటున్నారు.

By : Vinay Goud, Vemulapally 

మరిన్ని వార్తలు