నిండుకుండలా రాయిని గూడెం మత్తడి..!
నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని రాయిని గూడెం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఉరుముల మెరుపులతో కూడిన వర్షం కురవడంతో రాయినిగూడెం గ్రామంలోని మత్తడి ఒక్కసారిగా నిండుకుండలా మారింది.

నిండుకుండలా రాయిని గూడెం మత్తడి..!
చింతపల్లి, మన సాక్షి :
నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని రాయిని గూడెం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఉరుముల మెరుపులతో కూడిన వర్షం కురవడంతో రాయినిగూడెం గ్రామంలోని మత్తడి ఒక్కసారిగా నిండుకుండలా మారింది. గత వారం పది రోజుల నుండి రైతులు పత్తి విత్తనాలు పెట్టి వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. మరి కొంతమంది రైతులు తమ బొ రుబావుల నుండి మొలకెత్తని పత్తి విత్తనాలక స్పీంక్ లర్ల సహాయంతో నీటిని పెట్టి మొలకెత్తిన మొలకలను కాపాడుకునేందుకు సర్వప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు ఏర్పడి మండలంలోని కొన్ని గ్రామాలలో మోతాదు వర్షం కురిసినట్లు రైతులు పేర్కొన్నారు. మండలంలోని రాయి ని గూడెం గ్రామంలో కురిసిన మోతాదు వర్షానికి ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా నిండుకోవడంతో మత్తడి పారుతుంది. దీంతో ఆ గ్రామ రైతులు వర్షాలు సమృద్ధి గానే కురుస్తాయి లే అంటూ ఆనందం వ్యక్తం చేశారు.









