Breaking Newsక్రైంజిల్లా వార్తలురంగారెడ్డి
Suicide : జన్వాడలో ఉరివేసుకుని భార్యాభర్తలు మృతి..!
ఉరి వేసుకుని భార్యాభర్తలు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Suicide : జన్వాడలో ఉరివేసుకుని భార్యాభర్తలు మృతి..!
శంకర్పల్లి: (మన సాక్షి):
ఉరి వేసుకుని భార్యాభర్తలు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శంకర్పల్లి మండల పరిధిలోని జన్వాడ గ్రామంలో ఓ ఇంటిలో ఆదివారం రాత్రి ఇద్దరు భార్యాభర్తలు వలబాల సాయి (32), పద్మ ఉరివేసుకొని మృతి చెందారు. వృత్తిరీత్యా సాయి ఫోటోగ్రాఫర్. ఏడాదిన్నర క్రితమే వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆరు నెలల కుమారుడు ఉన్నాడు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









